బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రంగస్థలం

రామ్ చరణ్ హీరోగా డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన రంగస్థలం. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఉన్న 1500...
రామ్ చరణ్ హీరోగా డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన రంగస్థలం. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఉన్న 1500 థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన 2వ రోజే రూ. 60 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రంగస్థలం మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 43.80 కోట్ల గ్రాస్ సాధించినట్లు అంచనా. ఇందులో రూ. 28.30 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో 6వ స్థానం, సౌతిండియాలో 8వ స్థానం ఇక తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన 6వ చిత్రంగా, సౌతిండియా వ్యాప్తంగా తీసుకుంటే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన 8వ చిత్రంగా ‘రంగస్థలం' నిలిచిందని ట్రేడ్ పండితులు అంటున్నారు.
సినిమా చూసిన ప్రతి ఒక్కరి నుండి పాజిటివ్ టాక్ రావడం సినిమాకు బాగా కలిసొస్తోంది. మౌత్ టాక్ బావుండటంతో కలెక్షన్లు జోరుమీదున్నాయి. అయితే తొలి రోజుతో పోల్చకుంటే శనివారం వసూళ్లు దాదాపు 50 శాతం తగ్గాయి. తొలి రోజు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండటం, టికెట్ రేటు ఎక్కువగా ఉండటం... రెండో రోజు అవి లేక పోవడంతో వసూళ్ల ఫిగర్ చిన్నగా కనిపిస్తోంది.
రంగస్థలం మూవీ శనివారం బాక్సాఫీసు వద్ద రూ. 21 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండు రోజుల కలెక్షన్ కలిపి రూ. 63.80 కోట్లకు రీచ్ అయింది. ఇక శనివారం డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 13.50 కోట్లు వచ్చినట్లు సమాచారం.
రెండు రోజుల్లో కలిపి ఈ చిత్రానికి దాదాపు రూ. 41.86 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ చిత్రం డిస్ట్రిబ్యూసన్ రైట్స్ రూ. 80 కోట్లకు అమ్మారు. అయితే రెండు రోజుల్లోనే 50 శాతంమేర తిరిగి రావడం విశేషం.
తొలి రెండు రోజుల్లో ఏరియా వైజ్ వసూళ్లు పరిశీలిస్తే నైజాంలో రూ. 7.48 కోట్లు, సీడెడ్ రూ. 5.50 కోట్లు, వైజాగ్ రూ. 3.76 కోట్లు, ఈస్ట్ రూ. 2.71 కోట్లు, వెస్ట్ రూ. 2.11 కోట్లు, కృష్ణ రూ. 2.23 కోట్లు, గుంటూరు రూ. 3.79 కోట్లు, నెల్లూరు రూ. 1.05 కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
తిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMTహైదరాబాద్ ఓల్డ్‌సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‌లో రాణిస్తున్న 14 ఏళ్ల...
27 May 2022 5:08 AM GMTరేవంత్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లో రచ్చ.. వివరణ ఇవ్వాలని మధుయాష్కీ...
27 May 2022 4:15 AM GMTనిన్న టీవీ ఆర్టిస్ట్‌ను చంపిన ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో హతం...
27 May 2022 3:48 AM GMTమూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా సీవీ ఆనంద్...
27 May 2022 3:00 AM GMT