logo
సినిమా

అవును.. ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డాను!

అవును.. ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డాను!
X
Highlights

ఇది వరకూ బాలీవుడ్‌లో ప్రేమకథలను నడిపిన నేపథ్యం ఉంది రణ్‌బీర్ కపూర్‌కు. సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్...

ఇది వరకూ బాలీవుడ్‌లో ప్రేమకథలను నడిపిన నేపథ్యం ఉంది రణ్‌బీర్ కపూర్‌కు. సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్‌లో కూడా ఇతడు లవర్ బాయ్‌గా పేరు పొందాడు. ప్రత్యేకించి కత్రినాకైఫ్‌తో రణ్‌బీర్ ప్రేమకథ చాన్నాళ్ల పాటే సాగింది. కత్రినాతో కొన్నాళ్లు సహజీవనం కూడా చేశాడు రణ్‌బీర్. వీళ్లిద్దరూ కలిసి ఉండేవారు, కలిసి విహరించారు కూడా. ఒక దశలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. దానికి ఇంట్లో వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో ఒక విదేశీ సముద్ర తీరంలో కత్రినా, రణ్‌బీర్ సన్నిహితంగా ఉండిన పొటోలు బయటకు వచ్చాయి. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టే అనే ప్రచారం ఊపందుకుంది. ఆ ప్రచారం ఎంత త్వరగా ఊపందుకుందో అంతే త్వరగా దానికి బ్రేక్ పడింది.

ఎందుకంటే రణ్‌బీర్, కత్రినాల మధ్య బ్రేకప్ అయ్యింది. వీరిద్దరూ విడిపోయారు. తమ లవ్ నెస్ట్ నుంచి కూడా కత్రినా బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఇద్దరూ బిజీ అయిపోయారు. ఒక సినిమాలో కలిసి నటించినా ప్రేమమళ్లీ చిగురించలేదు. అదలా ఉంటే ఇప్పుడు రణ్‌భీర్ మరో హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడట. ఆమె మరెవరో కాదు అలియా భట్. కొన్నాళ్లుగా వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని ప్రచారం మొదలైంది. ఇప్పుడీ వార్తను రణ్‌బీర్ ధృవీకరించాడు. సంజు ట్రైలర్‌కు ఊహించని రెస్పాన్స్ వస్తుండటంతో తెగ ఆనందపడుతున్న రణ్‌బీర్.. తన అఫైర్ గురించి చెప్పేశాడు. జీక్యూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలియాతో డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నించగా.. అవునని రణ్‌బీర్ చెప్పాడు. ఇప్పుడే ప్రేమ మొదలైంది. దీనిపై ఎక్కువగా మాట్లాడను. కాస్త సమయం కావాలి. ఆలియా ఓ అద్భుతమైన నటి, అంతకుమించి మంచి మనిషి అని రణ్‌బీర్ అన్నాడు. కొత్తగా ప్రేమలో పడినప్పుడల్లా తాను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు.

ఎక్సైటింగ్‌గా ఉంది. కొత్త వ్యక్తి.. అన్నీ కొత్తగా ఉన్నాయి. అయితే రెండేళ్ల కిందటితో పోలిస్తే నేనిప్పుడు చాలా మారిపోయాను. బంధాలకు విలువిస్తున్నాను అని ఈ స్టార్ హీరో అన్నాడు. ఒకరంటే మరొకరికి ఇష్టమని గతంలో ఈ ఇద్దరూ చెప్పినా.. తమ మధ్య ఉన్న బంధాన్ని పబ్లిగ్గా ఒప్పుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ ఇద్దరూ బ్రహ్మాస్త్ర అనే మూవీలో కలిసి నటిస్తున్నారు.

Next Story