logo
సినిమా

ర‌కుల్‌.. న్యూ ల‌వ్‌

ర‌కుల్‌.. న్యూ ల‌వ్‌
X
Highlights

ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన‌ బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ న‌టించిన కొత్త...

ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన‌ బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ న‌టించిన కొత్త చిత్రం 'స్పైడ‌ర్' ఈ నెల 27న ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది. మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా విడుద‌ల కానుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ర‌కుల్ ట్విట్ట‌ర్ లో 'మై న్యూ ల‌వ్' అంటూ ఓ పోస్ట్ చేసింది. ఇంత‌కీ అదేమిటంటే.. ఆమె కొత్త‌గా కొనుగోలు చేసిన మెర్సిడెస్‌ బెంజ్‌ కారు. ప్ర‌స్తుతం ఆమె ఆడీ క్యూ4 కారును వాడుతోంది. ఇప్పుడు మ‌రో కారు ఆమె గ్యారేజ్లో చేరింద‌న్న‌మాట‌. దీన్నిబ‌ట్టి చూస్తే.. ర‌కుల్‌కి కార్లపై ప్రేమ ఎక్కువ ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

Next Story