రాజస్థాన్‌లో వాడిపోయిన కమలం

రాజస్థాన్‌లో ఎన్నికల ఆనవాయితీని మార్చి కొత్త చరిత్ర లిఖించాలన్న కమలం కలలు కల్లలే అయ్యాయి. పక్కా వ్యూహంతో...
రాజస్థాన్‌లో ఎన్నికల ఆనవాయితీని మార్చి కొత్త చరిత్ర లిఖించాలన్న కమలం కలలు కల్లలే అయ్యాయి. పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన కాంగ్రెస్ పార్టీనే విజయం వరించింది. రాజస్థాన్ లో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావడంతో నేతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బొటాబొటి మెజారిటీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. రాజస్తాన్ అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అల్వార్ జిల్లాలోని రామ్‌గఢ్ నియోజకవర్గం బీఎస్‌పీ అభ్యర్ధి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక వాయిదా వేశారు. ఇక నిన్న ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్ 99, బీజేపీ 73 వరకు సీట్లు గెలుచుకున్నాయి. బీఎస్పీ 6 , ఇతరులు 21 మంది గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖుల్లో కొందరు గెలవగా, మరికొందరు ఓడిపోయారు. ముఖ్యమంత్రి వసుంధరరాజే ఝల్రాపటాన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యంగ్ టర్క్ సచిన్ పైలట్‌లు తమ నియోజకవర్గాల్లో గెలుపొందారు. సర్దార్‌పురా నుంచి బరిలో నిలిచిన అశోక్ గెహ్లాట్ కూడా 50 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టోంక్ నుంచి సచిన్ పైలట్ 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్లామయ్ ఆదర్శ్ నగర్ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు.
రాజస్థాన్‌లో ఓటమిని బీజేపీ నాయకత్వం అంగీకరించింది. ప్రజలు మార్పు కోరుకున్నారని, అదే తమకు విజయం కట్టబెట్టిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. కాగా ఫలితాలు స్పష్టం కావడంతో నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జైపూర్‌లో సమావేశమై తమ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు.
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
మరింత వేడెక్కుతున్న మునుగోడు పాలిటిక్స్
16 Aug 2022 5:04 AM GMTవరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMT