Top
logo

తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణకు వర్ష సూచన
X
Highlights

ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 21న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ...

ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 21న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.

కాగా నిన్న డోర్నకల్‌ 4 సెం.మీ, అశ్వారావుపేట 3 సెం.మీ, వెంకటాపూర్‌ 2 సెం.మీ, సత్తుపల్లి =2 సెం.మీ, రామగుండం 2 సెం.మీ, గోవిందరావు పేట 2 సెం.మీ, జూలూరుపాడు2 సెం.మీ, బాల్కొండ 2 సెం.మీ, ఇబ్రహీంపట్నం 2 సెం.మీ. తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.

Next Story