వాననీరు అసెంబ్లీని ఎందుకు తాకుతుంది?

వాననీరు అసెంబ్లీని ఎందుకు తాకుతుంది?
x
Highlights

నవ్యాంధ్ర నిర్మాణంలో భాగంగా వెయ్యి కోట్లు ఖర్చుపెట్టి వెలగపూడిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ డొల్లతనం మరోసారి బయటపడింది. మంగళవారం...

నవ్యాంధ్ర నిర్మాణంలో భాగంగా వెయ్యి కోట్లు ఖర్చుపెట్టి వెలగపూడిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ డొల్లతనం మరోసారి బయటపడింది. మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా సచివాలయం పరిసరాల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్‌లో మరోసారి వర్షపు నీరు వచ్చి చేరింది.
హఠాత్తుగా కురిసిన వర్షంతో ఏపీ తాత్కాలిక సచివాలయంలోకి మరోసారి వర్షపు నీరు వచ్చింది. భారీ వర్షానికి సచివాలయంలోని పలు గదుల్లోకి నీరు చేరింది. సచివాలయం ప్రాంగణం చెరువులా మారిపోయింది.

భారీ వర్షం కారణంగా సచివాలయంలోని మూడు, నాలుగు బ్లాక్‌లలోని వివిధ శాఖల గదులలోకి నీరు వచ్చిందని సమాచారం. సచివాలయం గేట్ నెంబర్ 2 దగ్గరున్న వెయిటింగ్ హాల్ లో కూడా నీరు రావడం అందరిని కలవరపరుస్తోంది. మే డే సెలవు వల్ల ఆఫీస్ లు పని చేయలేదు. ఇంకా ఎక్కడెక్కడ లీకేజీలు జరిగింది తెలియాల్సి ఉంది. సచివాలయంలోని 3వ బ్లాక్ లోని ఎలక్ట్రికల్ రూమ్‌తోపాటు ప్రతిపక్షనేత జగన్ ఛాంబర్‌లోకి వర్షపునీరు లీకైంది. సీలింగ్ నుంచి నీరు కారింది. దీనిపై వైసీపీ నేతలు అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. జగన్ ఛాంబర్‌తో పాటు పలు బ్లాక్‌లలో వర్షపు నీటిని సిబ్బంది ఎత్తిపోశారు.

ఎలక్ట్రికల్ రూమ్‌లో వాన నీరు అధికారులు వెంటనే ఎత్తిపోయడంతో పెను ప్రమాదం తప్పింది.

గత ఏడాది జూన్‌లో కురిసిన భారీ వర్షానికి ఇదే విధంగా జగన్ ఛాంబర్‌లో నీరు చేరింది. దీంతో వర్షం నీటిని బయటకు పంపించడానికి అసెంబ్లీ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. అయితే దీనిపై వైసీపీ తీవ్ర నిరసనలు చేపట్టడంతో స్పీకర్‌ విచారణ జరిపించారు. విచారణ చేపట్టిన కమిటీ పైపులను కోసివేయడంతోనే నీరు చేరిందంటూ నివేదిక ఇచ్చింది. అయితే తాజా వర్షంతో జగన్ ఛాంబర్ లీకేజీలు మళ్లీ బయటపడ్డాయి. చిన్నపాటి వర్షాలకే సచివాలయంలో నీరుచేరడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం గర్వించదగ్గ రాజధాని నిర్మాణం అంటే ఇదేనా అంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories