logo
జాతీయం

ఢిల్లీలోని కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద సందడే సందడి

ఢిల్లీలోని కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద సందడే సందడి
X
Highlights

ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు...

ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించనుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ మూడు చెరువులు నీరు తాగించారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story