logo
జాతీయం

ఆవేశభరితంగా మాట్లాడినా ప్రజల కష్టాలు చెప్పారు..

ఆవేశభరితంగా మాట్లాడినా ప్రజల కష్టాలు చెప్పారు..
X
Highlights

రాహుల్ గాంధీ. ఈ పేరు వింటేనే ఏదో తెలియని అమాయకత్వమని కొంతమంది ఫీలింగ్.. కానీ ఆయనలో మరో కోణందాగి ఉందన్న విషయం...

రాహుల్ గాంధీ. ఈ పేరు వింటేనే ఏదో తెలియని అమాయకత్వమని కొంతమంది ఫీలింగ్.. కానీ ఆయనలో మరో కోణందాగి ఉందన్న విషయం నిన్న బయటపడింది. లోక్ సభలో ఆవేశభరిత ప్రసంగ చేసినా ఆసాంతం ప్రజల కష్టాలు, ఏపీ ప్రజలకు అన్యాయంపై రాహుల్ మాట్లాడారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగంలో ఆవేదన కనిపించిందన్న రాహుల్ ఈ శతాబ్దపు బాధిత రాష్ట్రం ఏపీ అని ఆంధ్ర ప్రజలకు న్యాయం చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. మోదీలాంటి గారడీలు చేసే వ్యక్తి మరెవరూ లేరని విమర్శించిన రాహుల్.. మోదీ గారడీ దాడుల

తో దేశ రైతులు నష్టపోయారని అన్నారు. జన్ ధన్ ఖాతా ద్వారా ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పి, మాట తప్పారని అన్నారు. ఏటా 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్న హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో గాయం చేశారని గుజరాత్ లోని సూరత్ వ్యాపారులే చెప్పారని అన్నారు. ఏమాత్రం ఆలోచన లేకుండానే నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని ఫైర్ అయ్యారు.

అవిశ్వాస తీర్మాన చర్చ సమయంలో రాహుల్‌ నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ప్రధాని మోడీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో తాను ప్రధానిని కాదు... దేశానికి కాపలాదారుడ్ని అని చెప్పిన ప్రధాని.. ఇప్పుడు అమిత్‌ షా కుమారుడు దేశాన్ని దోచుకుంటుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అమిత్‌ షా కొడుకు తన ఆదాయన్ని 16000 రెట్లు పెంచుకున్నపుడు నోరు ఎందుకు మెదపలేదని నిలదీశారు.

ఇక రాహుల్ గాంధీ తన ప్రసంగం ముగించిన అనంతరం .. అందరికీ షాక్ ఇస్తూ. నేరుగా ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి మీరు కోపం తగ్గించుకొండి ప్రధాని జి.. అంటూ మోడీని ఆలింగనం చేసుకున్నారు. రాహుల్‌ చర్యతో ప్రధాని మోడీ అవాక్కయ్యారు. ఈ క్రమంలో మోదీ రాహుల్ వెన్నుతట్టి పంపించారు. తరువాత కూడా తన సీటులో కూర్చున్న రాహుల్.. సహచర ఎంపీలకు కన్నుగొట్టారు. దీనిపై స్పీకర్ సుమిత్రా మాహాజన్ తప్పుపట్టారు. సభలో ప్రధానిని ఆలింగనం చేసుకోవడం, ఇతర ఎంపీలను చూసి కన్నుగొట్టడం వంటివి చేయకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Next Story