రేపు రాధా నిర్ణయం ప్రకటించే అవకాశం?

రేపు రాధా నిర్ణయం ప్రకటించే అవకాశం?
x
Highlights

వైసీపీలో ప్రస్తుతం అంతర్యుద్ధం మొదలైంది. విజయవాడ సెంట్రల్ సీటు ఇందుకు కారణమైంది. ఆ సీటు తనకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఆశలు...

వైసీపీలో ప్రస్తుతం అంతర్యుద్ధం మొదలైంది. విజయవాడ సెంట్రల్ సీటు ఇందుకు కారణమైంది. ఆ సీటు తనకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఆశలు పెట్టుకున్నారు. తీరా ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలే సమయమే ఉన్నందున రాధాకు వైసీపీ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో వంగవీటి రాధ వర్గంలో అసమ్మతి నెలకొంది. అయితే రాధను విజయవాడ ఈస్ట్ కానీ బందరు పార్లమెంటుకు కానీ వెళ్ళమని చెపింది. దీనిపై రెండు రోజులుగా సమాలోచనలు చేసిన రాధా వర్గం రేపు రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వనందుకు నిరసనగా రాధా వైసీపీకి రాజీనామా చెయ్యొచ్చని కొందరంటుంటే.. బందరు పార్లమెంటుకు మొగ్గు చూపే అవకాశమున్నట్టు మరికొందరు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories