logo
సినిమా

'రాజా ది గ్రేట్' విడుద‌ల వాయిదా?

రాజా ది గ్రేట్ విడుద‌ల వాయిదా?
X
Highlights

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ గ‌త చిత్రం 'బెంగాల్ టైగ‌ర్' రిలీజై దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది. ఆ సినిమా త‌రువాత కొద్ది ...

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ గ‌త చిత్రం 'బెంగాల్ టైగ‌ర్' రిలీజై దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది. ఆ సినిమా త‌రువాత కొద్ది కాలం విరామం తీసుకున్న ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం 'రాజా ది గ్రేట్‌', 'ట‌చ్ చేసి చూడు' చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వీటిలో 'రాజా ది గ్రేట్' విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని అక్టోబ‌ర్ 12న విడుద‌ల చేయాల‌నుకున్నారు.

అయితే అక్టోబ‌ర్ 13న నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న 'రాజు గారి గ‌ది2'ని విడుద‌ల చేస్తుండ‌డంతో ఈ చిత్రాన్ని వాయిదా వేసుకున్న‌ట్లు తెలుస్తోంది. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. అక్టోబ‌ర్ 18న ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. 'రాజా ది గ్రేట్‌'లో ర‌వితేజ అంధుడి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. అత‌ని స‌ర‌స‌న మెహ‌రీన్ క‌థానాయికగా న‌టిస్తోంది. సాయికార్తీక్ సంగీత‌మందిస్తున్నాడు.

Next Story