ఫోర్బ్స్ జాబితాలో పీవీ సింధు.. ఏడాదికి 60 కోట్లు

ఫోర్బ్స్ జాబితాలో పీవీ సింధు.. ఏడాదికి 60 కోట్లు
x
Highlights

ఆట పరంగానే కాదు ఆదాయార్జనలోనూ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అదరగొడుతోంది. ఫోర్బ్స్‌ ప్రకారం ప్రైజ్‌మనీ, ఎండార్స్‌మెంట్స్‌ ద్వారా ఆమె సంపాదన...

ఆట పరంగానే కాదు ఆదాయార్జనలోనూ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అదరగొడుతోంది. ఫోర్బ్స్‌ ప్రకారం ప్రైజ్‌మనీ, ఎండార్స్‌మెంట్స్‌ ద్వారా ఆమె సంపాదన ఏడాదికి 60 కోట్లట. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక మొత్తాన్ని ఆర్జిస్తున్న మహిళా క్రీడాకారుల్లో ఆమె టాప్‌ టెన్‌లో ఉన్నారట. ఫోర్బ్స్ వెలువరించిన జాబితా ప్రకారం సింధుకు ఏడో స్థానం దక్కగా అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరినా విలియమ్స్‌కు అగ్రస్థానం దక్కింది.

భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్న క్రీడాకారిణిల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం భారత్‌ నుంచి టాప్ 10లో ఏకైక క్రీడాకారిణిగా సింధు నిలిచింది. అలాగే, టెన్నిస్ క్రీడాకారిణులు కాకుండా కేవలం ఇద్దరు మాత్రమే ఇతర ఆటగాళ్లకు టాప్‌ 10లో చోటు దక్కింది.

ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారిణుల పేర్లను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ తమ వార్షిక జాబితాలో వెల్లడించింది. దీంట్లో ఈ హైదరాబాదీ 8.5 మిలియన్‌ డాలర్లు అంటే 59 కోట్ల 36 లక్షలుతో ఏడో స్థానంలో నిలిచింది. టాప్‌-10 జాబితాలో సింధుతో పాటు మాజీ రేస్‌ కార్‌ డ్రైవర్‌ డానికా ప్యాట్రిక్‌ మినహా ఎనిమిది మంది టెన్నిస్‌ క్రీడాకారిణులే ఉన్నారు.

గతేడాది సింధు ప్రైజ్‌మనీ ద్వారా 5 లక్షల డాలర్లు మన కరెన్సీ ప్రకారం 3 కోట్ల 49 లక్షలు, ఎండార్స్‌మెంట్‌ ద్వారా 8 మిలియన్‌ డాలర్లు అంటే 55 కోట్ల 87 లక్షలను ఆర్జించింది. వరుస విజయాలతో హోరెత్తించడంతో నోకియా, పానసోనిక్‌ తదితర టాప్‌ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా మారడం ఆమె ఆదాయాన్ని పెంచింది. ఈ జాబితాలో అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ 18.1 మిలియన్‌ డాలర్లుతో అగ్రస్థానంలో నిలిచింది.

ఫోర్బ్స్ టాప్ టెన్ కుబేర క్రీడాకారిణుల జాబితా

1.సెరెనా విలియమ్స్‌ – 18.1 మిలియన్ల డాలర్లు
2. కరోలిన్‌ వోజ్నియాకి – 13 మిలియన్ల డాలర్లు
3. స్లోనే స్టిఫెన్స్‌ – 11.2 మిలియన్ల డాలర్లు
4. గార్బైన్‌ ముగురుజా – 11 మిలియన్ల డాలర్లు
5. మరియా షరపోవా – 10.5 మిలియన్ల డాలర్లు
6. వీనస్‌ విలియమ్స్‌ – 10.2 మిలియన్ల డాలర్లు
7. పీవీ సింధు – 8.5 మిలియన్ల డాలర్లు
8. సిమోనా హలెప్‌ – 7.7 మిలియన్ల డాలర్లు
9. డానికా పాట్రిక్‌ – 7.5 మిలియన్ల డాలర్లు
10. ఎంజెలిక్‌ కెర్బర్‌ – – 7 మిలియన్ల డాలర్లు

Show Full Article
Print Article
Next Story
More Stories