చరిత్ర సృష్టించిన పీవీ సింధు!

చరిత్ర సృష్టించిన పీవీ సింధు!
x
Highlights

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. ఈ టైటిల్‌ గెలిచిన తొలి భారత...

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. ఈ టైటిల్‌ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ ఒకుహర(జపాన్‌)పై సింధు అద్భుత పోరాటంతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 21-19, 21-17 తేడాతో వరుస సెట్లలో గెలిచి ప్రత్యర్థిని మట్టికరిపించింది. నిరుడు ఫైనల్లో ఓడిన ఆమె ఈ సారి టైటిల్‌ గెలిచి తన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఏడాది సింగిల్స్‌లో సింధు ఖాతాలో తొలి టైటిల్‌ ఇదే కావడం విశేషం

Show Full Article
Print Article
Next Story
More Stories