జగన్ నిర్ణయానికి ఊతమిచ్చిన పురందేశ్వరి!

జగన్ నిర్ణయానికి ఊతమిచ్చిన పురందేశ్వరి!
x
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ నిర్ణయానికి ఊతమిచ్చారు బీజేపీ నాయకురాలు పురందేశ్వరి.. దివంగత ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద...

వైసీపీ అధినేత వైయస్ జగన్ నిర్ణయానికి ఊతమిచ్చారు బీజేపీ నాయకురాలు పురందేశ్వరి.. దివంగత ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురందేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోదపరంగాను ప్రజాసేవలోగాను ఎన్నో సేవలు అందించిన ఎన్టీఆర్ కు నివాళిగా కృష్ణా జిల్లాను నందమూరి తారకరామారావు జిల్లాగా మార్చాలని ఆమె సూచించారు. ఎన్టీఆర్ జయంతిని పండగలా జరపాలని అన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని కోరారు. కాగా నెలరోజులక్రితం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో పరిటించి తాము అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తామని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories