మరో ఘనతను సాధించిన ఇస్రో

మరో ఘనతను సాధించిన ఇస్రో
x
Highlights

ఇస్రో మరో ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని షార్ వేదికగా జరిగిన PSLV-C-43 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్‌ ప్రయోగం ద్వారా హైసిన్‌, సీరియో అనే...

ఇస్రో మరో ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని షార్ వేదికగా జరిగిన PSLV-C-43 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్‌ ప్రయోగం ద్వారా హైసిన్‌, సీరియో అనే రెండు స్వదేశీ ఉపగ్రహాలతోపాటు 8 విదేశాలకు చెందిన మరో 29 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. ఒక మైక్రో, 29నానో ఉపగ్రహాలున్నాయి. వీటిల్లో 23శాటిలైట్లు అమెరికాకు చెందినవి కాగా ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్‌, మలేసియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉంది. ఇవాళ(గురువారం) ఉదయం 9 గంటలకు 57 నిమిషాలకు…. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్‌ నుంచి పీఎస్‌ఎల్వీ – సీ43 రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాగా ఈ రాకెట్లో ప్రధాన ఉపగ్రహమైన హైసిస్‌ను ఇస్రో అభివృద్ధి చేసింది. దీని బరువు సుమారు 380 కిలోలు. ఈ శాటిలైట్‌ను భూమికి 636 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ఈ మిషన్ కాలపరిమితి ఐదేళ్లు. భూ ఉపరితల పరిస్థితులను పరిశీలించడం హైసిస్ ఉపగ్రహం ప్రధాన లక్ష్యం. రాకెట్ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో షార్‌లో ఆనందోత్సాహలు వెల్లివిరిశాయి. శాస్త్రవేత్తలు పరస్పరం కరచాలనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories