logo
జాతీయం

రైతులపై దాడిని సమర్ధించుకున్న పోలీసులు

రైతులపై దాడిని సమర్ధించుకున్న పోలీసులు
X
Highlights

ఢిల్లీలో రైతులపై చేసిన దాడిని పోలీసులు సమర్ధించుకున్నారు. రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో టియర్‌ గ్యాస్...

ఢిల్లీలో రైతులపై చేసిన దాడిని పోలీసులు సమర్ధించుకున్నారు. రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో టియర్‌ గ్యాస్ ప్రయోగం చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ట్రాక్టర్ అనుమతి లేదని...అందుకే రైతులను అడ్డుకోవలసి వచ్చిందని పోలీసులు తెలిపారు. శాంతి యుతంగా వస్తే తాము సహకరిస్తామని పోలీసులు అంటున్నారు. రైతులపై జరిగిన లాఠీచార్జ్‌పై విపక్ష నేతలు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. రైతులను తక్షణమే ఢిల్లీలోకి అనుమతించాలంటూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమ్‌ ఆద్మీ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ యూపీ మాజీ సీఎం అఖిలేష్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరు వల్లే రైతులు ఆందోళన బాట పట్టారన్నారు.

Next Story