logo
ఆంధ్రప్రదేశ్

జగన్ పై దాడి : రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

జగన్ పై దాడి : రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
X
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరగడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా...

ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరగడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశారు. అనంతపురంలో మరో వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ దాడి చంద్రబాబు ప్రభుత్వ కుట్రలో భాగమేనని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Next Story