చలి కాలంలో చర్మ సంరక్షణకు ఈ టిప్స్..

చలి కాలంలో చర్మ సంరక్షణకు ఈ టిప్స్..
x
Highlights

చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు పెరుగుతుంటాయి. చలికి చర్మం పగుళ్లు, పెదాలు, కాళ్ళ పగుళ్లు, పొడిబారిపోవడం, ఎంత మేకప్‌ వేసుకున్నా సరే పగుళ్లతో...

చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు పెరుగుతుంటాయి. చలికి చర్మం పగుళ్లు, పెదాలు, కాళ్ళ పగుళ్లు, పొడిబారిపోవడం, ఎంత మేకప్‌ వేసుకున్నా సరే పగుళ్లతో చర్మం పాడవుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

*శీతాకాలంలో ఎక్కువగా చల్లదనం కారణంగా బాగా వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తారు. కానీ అలా చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు. చలిని పోగొట్టుకోవాలంటే గోరు వెచ్చని నీటినే స్నానానికి ఉపయోగించాలి. వేడి నీటి వల్ల చర్మంలో సహజ సిద్ధంగా ఉండే ఆయిల్స్ పోతాయి. దీంతో చర్మం పొడిగా మారుతుంది. ఇక గోరు వెచ్చని నీటితో స్నానం చేసేటప్పుడు అందులో కొద్దిగా కొబ్బరినూనె వుండేట్టుగా చూసుకోవాలి దానితో చర్మం మృదువుగా మారుతుంది.

*ఇక స్నానం చేసిన తరువాత కొందరికి చర్మం పొడిగాను, పెచ్చులుగాను తయారవుతుంది. దానికి కొంచెం ఆలివ్ ఆయిల్ గనక రాస్తే సరిపోతుంది.

*చలికాలంలో ముఖంపై మృత కణాలు ఉంటాయి. వీటిని పోగొట్టాలంటే వారంలో ఒకటి లేదా రెండు సార్లయినా ఫేస్ వాష్‌ను ఉపయోగించి ముఖం కడగాలి. దాంతో మృత కణాలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

*విపరీతమైన చలి కారణంగా ఉదయం లేవగానే చర్మం పొడిగా మారుతుంది. దానికి రాత్రివేళ నిద్రపోయే ముందే చర్మానికి పగుళ్ల నివారణ క్రీములు రాసుకుంటే మంచిది.

*చలికాలంలో ప్రతి ప్రతిఒక్కరు చేసే తప్పిదం నీటిని సమృద్ధిగా తీసుకోకపోవడం. ఇలా చేయడం తప్పని అంటున్నారు నిపుణులు. రోజూ తగినంత మోతాదులో నీటిని త్రాగితే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీంతో చర్మం మృదువుగా ఉండి తేమను కోల్పోకుండా ఉంటుంది.

*అలాగే ఈ కాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు హెయిర్ డ్రయర్లకు దూరంగా ఉండాలి. లేదంటే వెంట్రుకల వద్ద చర్మం పొలుసులుగా లేసి చుండ్రు పెరిగే అవకాశముంది.

*విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకున్నా చర్మం మృదువుగా ఉండి.. కాంతివంతంగా మారుతుంది.

ఇలా జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో చర్మంలో జరిగే మార్పులను అరికట్టవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories