ప్రొఫెసర్‌ పాడుపని

ప్రొఫెసర్‌ పాడుపని
x
Highlights

నెల్లూరు మెడికల్ కాలేజీ మరోసారి వార్తల్లో నిలిచింది.. ర్యాంగింగ్.. విధుల్లో నిర్లక్ష్యం.. అవినీతి ఆరోపణలతో జిల్లా పరువు పోగొట్టిన వైద్యులు తాజాగా ...

నెల్లూరు మెడికల్ కాలేజీ మరోసారి వార్తల్లో నిలిచింది.. ర్యాంగింగ్.. విధుల్లో నిర్లక్ష్యం.. అవినీతి ఆరోపణలతో జిల్లా పరువు పోగొట్టిన వైద్యులు తాజాగా మరో వివాదంలో నిలిచారు.. మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్ధిని పట్ల అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ లైంగిక వేధింపులకు గురిచస్తున్నాడని విద్యార్దిని కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేశారు.. మెడికల్ కాలేజీలో హెచ్.వో.డీల సమావేశం జరుగుతున్న సమయంలో మీటింగ్ హాల్లోకి వెళ్ళిన విద్యార్దిని సోదరుడు ప్రొఫెసర్ పై చేయి చేసుకున్నాడు.

నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఫైనల్ ఇయర్ విద్యార్ధి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సర్జరీ డిమోకు వెళ్లిన విద్యార్ధినిని అసభ్యంగా తాకుతూ వెకిలి వేశాలు వేశాడు. దీంతో ఈ విద్యార్ధిని కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేసింది. దీంతో ఆమె సోదరుడు మెడికల్ కాలేజీకి వెళ్లి ప్రొఫెసర్‌ను చితక బాదాడు. విద్యార్ధిని సోదరుడు చేసిన దాడిలో ప్రొఫెసర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో విషయం అందరికి తెలిసింది. బాధిత విద్యార్ధి అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్‌పై ఫిర్యాదు చేసింది. విద్యార్ధిని పట్ల ఇలా ప్రవర్తిస్తే ఇక పేషంట్ల పట్ల ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని బాధిత విద్యార్ధిని తన ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రొఫెసర్ అసభ్య చేష్టలను సూపరింటెండెంట్ రాజు తీవ్రంగా ఖండించారు. విచారణ జరిపిన తర్వాత పూర్తి విషయం బయటకు వస్తుందని రాజు అన్నారు. వైద్యులపై దాడిని కూడా ఆయన ఖండించారు. అసలే చాలా విభాగాలకు ప్రొఫెసర్లు లేక ఉన్న ప్రొఫెసర్లు సరిగా విధులకు రాక, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రజల్లో పలుచనై పోయిన ఈ కాలేజీ తాజాగా ఈ ఘటనతో ఉన్న పరువు కాస్త పోయింది.. మరోపక్క మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ నిర్మలాదేవి మాట్లాడుతూ విద్యార్దిని ప్రొఫసర్ పై తనకు పిర్యాదు చేసిందని, విచారణ జరుపుతున్నామని ఆమె తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories