ప్రో-కబడ్డీలీగ్ ఐదోసీజన్ కు రికార్డ్ రేటింగ్

Highlights

ఇటీవలే ముగిసిన ప్రో-కబడ్డీలీగ్ ఐదోసీజన్ ఫైనల్స్ కు రికార్డుస్థాయిలో రేటింగ్ వచ్చినట్లు నిర్వాహక సంఘం గణాంకాలతో సహా ప్రకటించింది. రియో ఒలింపిక్స్ మహిళల...

ఇటీవలే ముగిసిన ప్రో-కబడ్డీలీగ్ ఐదోసీజన్ ఫైనల్స్ కు రికార్డుస్థాయిలో రేటింగ్ వచ్చినట్లు నిర్వాహక సంఘం గణాంకాలతో సహా ప్రకటించింది. రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఆడిన మ్యాచ్ కంటే ప్రో-కబడ్డీ లీగ్ ఐదోసీజన్ ఫైనల్స్ పోటీని అత్యధికంగా వీక్షకులు చూశారని వివరించింది. ప్రో-కబడ్డీలీగ్ నాలుగో సీజన్లో కేవలం 56 మ్యాచ్ లకు మాత్రమే పరిమితమైన టోర్నీని ఐదోసీజన్ లో మాత్రం 132 మ్యాచ్ ల మారథాన్ సమరంగా నిర్వహించారు. తమిళనాడులో గతంలో కంటే 3.6 రెట్లు అధికంగా రేటింగ్ నమోదైనట్లుగా వివరించారు. ఫ్రాంచైజీల రేటింగ్ సైతం ఆరుశాతం అధికంగా నమోదుకావడం విశేషం. ఐపీఎల్ పదోసీజన్ ఫైనల్ ను 3 కోట్ల 94 లక్షల మంది వీక్షిస్తే ప్రో-కబడ్డీలీగ్ ఐదోసీజన్ టైటిల్ ఫైట్ ను 2 కోట్ల 62 లక్షల మంది వీక్షించినట్లు ప్రకటించారు. మరోవైపు 132 మ్యాచ్ లతో దాదాపు మూడుమాసాలపాటు ఐదోసీజన్ లీగ్ నిర్వహించడంతో ప్రో-కబడ్డీలీగ్ అంటే వీక్షకులు విసిగిపోయారని, ఓవరాల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని మరోవైపు ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories