మళ్లీ కష్టాల్లో ప్రియా ప్రకాష్ వారియర్

ప్రియా వారియర్‌కు మళ్ళీ కోర్టు కేసుల కష్టాలు మొదలయ్యాయి. ఇస్లాం ప్రకారం కన్ను కొట్టడం దైవాన్ని నిందించడమే అంటూ ...
ప్రియా వారియర్‌కు మళ్ళీ కోర్టు కేసుల కష్టాలు మొదలయ్యాయి. ఇస్లాం ప్రకారం కన్ను కొట్టడం దైవాన్ని నిందించడమే అంటూ హైదరాబాద్‌లో మరో పిటిషన్ దాఖలైంది. ప్రియావారియర్ నటించిన పాట మహ్మద్ ప్రవక్త మరియు ఆయన భార్య ఖదీజా లని ప్రశంసిస్తూరాసినది. పవిత్రమైన ఆ పాటలో ప్రియా వారియర్ కొట్టడం దైవ దూషణ చేయడమే అంటూ మరో ఇద్దరు వ్యక్తులు కోర్టు తలుపు తట్టడం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది
తొలి సినిమా విడుదలకు ముందే ఎవ్వరూ ఊహించనంత పాపులారిటీ సంపాదించింది మలయాళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. తన తొలి చిత్రం ఒరు అదార్ లవ్ లో మూవీలో ఆమె హావభావాలకు యువత ఫిదా అయ్యారు. ఒక్క కన్ను గీటతోనే జాతీయస్థాయిలో అభిమానులను కూడా సంపాదించిపెట్టింది. యూ ట్యూబ్ లో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది.. అయితే ఇంత పాపులర్ అయిన ప్రియా వారియర్‌కు మాత్రం లీగల్ కష్టాలు తప్పట్లేదు.. ఫిబ్రవరిలో ఒరు ఆదార్ లవ్ మూవీలోని సాంగ్ మాణిక్య మలరాయ పూవి ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉదంటూ కేసు నమోదయింది.. ఆ తరువాత సుప్రీంకోర్టు ప్రియాకు ఆ కేసు నుంచి ఊరట కల్పించింది. అయితే మళ్లీ తాజాగా ఇదే సాంగ్ విషయమై ప్రియాపై మరో కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రియా కన్నుకొట్టడాన్ని తప్పు పడుతూ కేసు వేశారు.
మాణిక్య మలరాయ పూవి అనే సాంగ్ మహ్మద్ ప్రవక్త మరియు ఆయన భార్య ఖదీజా లని ప్రశంసిస్తూరాసినది. పవిత్రమైన ఆ పాటలో ప్రియా వారియర్ కన్నుగీటడం దైవ దూషణ చేయడమే అని ముస్లిం యువకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ యాక్ట్‌ను వారు ప్రస్తావిస్తూ ప్రియా పిటీషన్‌పై తీర్పు ఇవ్వడానికి ముందు తమ పిటీషన్‌ను విచారణకు స్వీకరించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు కోర్టును అభ్యర్థించారు. మార్చి 1న విడుదల కావాల్సిన ఈ సినిమా.. కోర్టు చిక్కుల కారణంగా జూన్‌కు వాయిదా పడింది.. తాజాగా ఈ వ్యవహారం పై మరో కేసు నమోదు అవడంతో మూవీ రిలీజ్ పై నీలి నీడలు అలముకున్నాయి.. మొత్తానికి ఈ వ్యవహారం దాదాపు ముగిసి పోయింది అనుకుంటున్న సమయంలో తాజా కేసుతో ఏమలుపు తిరుగుతుందో అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
పాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMTహైదరాబాద్ ఓల్డ్‌సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‌లో రాణిస్తున్న 14 ఏళ్ల...
27 May 2022 5:08 AM GMTరేవంత్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లో రచ్చ.. వివరణ ఇవ్వాలని మధుయాష్కీ...
27 May 2022 4:15 AM GMT