18 ఏళ్ల వయసులోనే పృథ్వీ షాకు టెస్ట్ క్యాప్

18 ఏళ్ల వయసులోనే పృథ్వీ షాకు టెస్ట్ క్యాప్
x
Highlights

ముంబై యువ ఓపెనర్ పృథ్వీ షా 18 ఏళ్ల చిరుప్రాయంలోనే టెస్ట్ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. రాజ్ కోట్ వేదికగా విండీస్ తో గురువారం ప్రారంభమయ్యే తొలిటెస్ట్...

ముంబై యువ ఓపెనర్ పృథ్వీ షా 18 ఏళ్ల చిరుప్రాయంలోనే టెస్ట్ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. రాజ్ కోట్ వేదికగా విండీస్ తో గురువారం ప్రారంభమయ్యే తొలిటెస్ట్ ద్వారా పృథ్వీ షా తన తొలిటెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. భారత కెప్టెన్ గా జూనియర్ ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా దేశవాళీ రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ టోర్నీల్లో సైతం నిలకడగా రాణించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. పృథ్వీ షా తన ఫస్ట్ క్లాస్ కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 14 మ్యాచ్ ల్లో 56.72 సగటు నమోదు చేశాడు. ఏడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలతో పృథ్వీ షా సత్తా చాటుకొన్నాడు. సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా కెఎల్ రాహుల్ తో కలసి టీమిండియా బ్యాటింగ్ ను పృథ్వీ షా ప్రారంభించనున్నాడు. 293వ భారత టెస్ట్ క్రికెటర్ గా ఈ చిట్టిపొట్టి ఓపెనర్ రికార్డుల్లో చేరనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories