దొంగల కిరాతకం.. గర్భిణిని రైల్లోంచి తోసేసి..

దొంగల కిరాతకం.. గర్భిణిని రైల్లోంచి తోసేసి..
x
Highlights

మానవత్వం మంటగలిసేలా ఇద్దరు దొంగలు ప్రవర్తించారు. కదులుతున్న రైల్లో నుంచి నిండు గర్భిణిని కిందకు తోసేశారు దొంగలు, అనంతరం ఆమె వద్ద నుంచి రూ.2.5 లక్షల...

మానవత్వం మంటగలిసేలా ఇద్దరు దొంగలు ప్రవర్తించారు. కదులుతున్న రైల్లో నుంచి నిండు గర్భిణిని కిందకు తోసేశారు దొంగలు, అనంతరం ఆమె వద్ద నుంచి రూ.2.5 లక్షల విలువైన ఆభరణాలు అపహరించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గొల్లపల్లి వద్ద నిన్న(మంగళవారం) జరిగింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన కారునాటి దివ్యకు అదే జిల్లాకు చెందిన శ్రీనివాసులుతో ఏడాది కిందటే వివాహం జరిగింది. శ్రీనివాసులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం దివ్య పిడుగురాళ్ల వద్దే ఉంటోంది. ఈ క్రమంలో భర్త శ్రీనివాసులును చూడాలని అత్త సుబ్బలక్ష్మితో కలిసి కొండవీడు ఎక్స్ ప్రెస్ లో బయలుదేరారు. అయితే అనంతరం జిల్లా గొల్లపల్లి వద్ద దివ్య మరుగుదొడ్డికి వెళ్ళింది. అక్కడే కాపుకాసిన
ఇద్దరు దొంగలు దివ్యను కిందకు తోసేశారు. అనంతరం వారు కూడా దూకి ఆమె వద్దనున్న నగలను దోచుకెళ్లారు. రైల్వే సిబ్బంది దివ్యను చూసి వెంటనే ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె కడుపులోని బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది బిహార్‌ గ్యాంగ్‌ పని అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories