ప్రజల నాడి పట్టేసిన ప్రశాంత్ కిషోర్..!

ప్రజల నాడి పట్టేసిన ప్రశాంత్ కిషోర్..!
x
Highlights

జగన్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఊళ్లు దాటుకుంటూ.. జన సందోహం మధ్య ఒక ప్రవాహంలా సాగిపోతోంది. ఇప్పటికే కడప నుంచి కర్నూల్, కర్నూల్ నుంచి అనంతపురం లోకి...

జగన్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఊళ్లు దాటుకుంటూ.. జన సందోహం మధ్య ఒక ప్రవాహంలా సాగిపోతోంది. ఇప్పటికే కడప నుంచి కర్నూల్, కర్నూల్ నుంచి అనంతపురం లోకి ప్రవేశించిన జగన్ రోజు రోజుకూ పాదయాత్ర స్పీడ్ పెంచుతున్నారు.. ఇప్పటికే నాలుగువందల కిలోమీటర్లు దాటేసిన జగన్ యాత్ర.. రోజు రోజుకూ జోష్ నింపుకుంటూ ముందుకు సాగుతోంది.. జగన్ పేరు చెబితే చాలు జనం తరలి వస్తారు.. ఆయన ప్రసంగాలను ఓపికగా వింటారు.. బాగా స్పందిస్తారు.. పార్టీ పెట్టిన నాటి నుంచీ.. నేటి వరకూ జగన్ కు కనిపిస్తున్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు.. కానీ ఈ ఆదరణ ఓట్లుగా మారకపోవడమే కలవర పెడుతోంది. అధికారం దక్కక ఓపక్క నిరాశపడుతుంటే.. పార్టీ ని వీడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.. వీటన్నింటికీ చెక్ చెప్పేందుకే జగన్ ఎన్నికల వ్యూహాలలో ఆరితేరిన ప్రశాంత్ కిషోర్ టీమ్ రంగంలోకి దిగింది.. ప్రస్తుతం జగన్ ఆ టీమ్ సలహాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. నడిచేది జగనే అయినా.. నడిపించేది ప్రశాంత్ కిషోరే.... మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర ఎలా సాగాలన్న దానిపై పీకే టీమ్ డైరక్షన్సే కీలకం..

జగన్ పాదయాత్ర మొత్తం ప్రశాంత్ కిషోర్ కనుసన్నల్లోనే నడుస్తోంది. రోజుకు ఎన్ని గంటలు పాదయాత్ర చేయాలి? మార్గ మధ్యంలో ఎవరెవరిని కలవాలి? ఎంత దూరం నడవాలి? అన్నీ పికే టీమ్ సూచిస్తుంది.ప్రతీ నియోజక వర్గంలోనూ బహిరంగ సభలు ఏర్పాటు ఆలోచన కూడా పీకే టీమ్ దే.. రైతులు, విద్యార్ధులతో ముఖాముఖీగా మాట్లాడటం.. రచ్చబండ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం.. సాయంత్రానికి ఏదో ఓ కీలక అంశం ఉండేలాగా ప్లాన్ చేశారు. ఇక జగన్ లైవ్ అప్ డేట్స్ సోషల్ మీడియాకు చేరేలా నిత్యం 70 మందితో సెపరేట్ టీమ్ వర్క్ చేస్తోంది. అంతేకాదు.. జగన్ మీడియాతో పాటూ.. సోషల్ మీడియా వైసిపి, వైఎస్ ఆర్ కుటుంబం, జై జగన్, ప్రజా సంకల్ప యాత్ర లైవ్ అంటూ 10కి పైగా పేజీల ద్వారా పాదయాత్ర పై ఫోకస్ పెడుతున్నారు..

జగన్ పాదయాత్రను ప్రశాంత్ టీమ్ అయిదు వైపుల నుంచి ఫాలో అవుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు వీరిని గుర్తించి దారి ఇచ్చేందుకు వీలుగా డ్రెస్ కోడ్ గా బ్లాక్ టీషర్టులు ధరిస్తున్నారు.. ఒక్కో టీమ్ కు ఆరుగురు సభ్యులున్నారు. వీరంతా జగన్ తో నడుస్తున్నారు..జగన్ ఎవరెవరిని కలుస్తారు? ఎవరితో ఏం మాట్లాడారు ఆడియో, వీడియో రికార్డులు ఎప్పటికప్పుడు జరిగిపోతుంటాయ్... ఫొటోలు క్లిక్ మంటుంటాయ్.. ఇవన్నీ హై స్పీడ్ నెట్ ద్వారా హైదరాబాద్ వైసిపి ఆఫీస్ కి చేరిపోతాయ్.. వాటిలో మెరుగైన ఫొటోలను ఎంపిక చేసి వీలైనన్ని గ్రూపులకు పంపుతున్నారు..అంతేకాదు.. సోషల్ మీడియా ద్వారా జగన్ స్పీచ్ ను లైవ్ ఇస్తున్నారు. అలాగే జనం స్పందనను కూడా పీకే టీమ్ కి చేరవేస్తున్నారు..
ఇక రెండో టీమ్ మీడియా వెంట ఉంటుంది.. మూడో టీమ్ ప్రజల్లో కలిసిపోతుంది.. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. నాల్గో టీమ్ ప్రధానంగా వృద్ధులు, విద్యార్ధులు, వికలాంగులు, మహిళలను కలిసి వారి ఒపీనియన్ తీసుకుంటుంది. ఇక అయిదో టీమ్ స్థానికంగా కీలకంగా ఉన్న వారి ఫోన్ నెంబర్లు తీసుకుంటుంది. యాత్ర పూర్తయినా ఈ టీమ్ వారితో టచ్లో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories