సీమలో జగన్ కు షాక్.. కష్టమే

సీమలో జగన్ కు షాక్.. కష్టమే
x
Highlights

ప్ర‌జాస‌మ‌స్య‌లే ల‌క్ష్యంగా వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జ‌లతో మ‌మేక‌వుతూ, వారి క‌ష్ట...

ప్ర‌జాస‌మ‌స్య‌లే ల‌క్ష్యంగా వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జ‌లతో మ‌మేక‌వుతూ, వారి క‌ష్ట సుఖాల్ని తెలుసుకుంటూ అటు పార్టీ కేడ‌ర్ ను ఇటూ పార్టీ నాయ‌కుల్లో కొత్త‌ ఉత్సాహాన్ని నింపుతున్నాడు. అయితే ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ కు కొన్ని జీర్ణించుకోలేని విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి.
జ‌గ‌న్ ఓ వైపు పాద‌యాత్ర చేస్తూ మ‌రోవైపు పార్టీ అస్థిత్వంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో స‌ర్వేలు చేయిస్తున్నారు. తాజాగా ప్ర‌శాంత్ కిషోర్ టీం రాయ‌ల‌సీమ‌లో స‌ర్వే నిర్వ‌హించింది. ఈస‌ర్వేలో జ‌గ‌న్ కంటే సీఎం చంద్ర‌బాబు ముంద‌జ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అస‌లే జ‌గ‌న్ కంచుకోట అయిన రాయ‌ల‌సీమ‌లో గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొవ‌డంపై పార్టీ కేడ‌ర్ ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.
గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ రాయల‌సీమ‌లో అత్య‌దిక సీట్లును సొంతం చేసుకుంది. కాబ‌ట్టే వైసీపీ స్కోరు 65 దాటింది. కానీ 2019 ఎన్నిక‌ల్లో మాత్రం 10సీట్లే గెలుస్తార‌ని పీకే స‌ర్వేలో తేలింద‌ట‌.
కరువు కాట‌కాల‌తో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రాయసీమకు చంద్ర‌బాబు నీరు అందించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాబ‌ట్టే ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం పెరిగింద‌ని క్రిటిక్స్ చెబుతున్నారు. దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న జ‌గ‌న్ పోస్టు మార్టం చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌.
ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి, రోజా వంటి వారికి కూడా గడ్డు పరిస్థితులే ఉన్నాయని తేలినట్టు సమాచారం. పార్టీలో ఏదైనా మార్పులు తెస్తే త‌ప్ప ఏం చేయ‌లేమ‌ని పీకే టీం జ‌గ‌న్ తో చ‌ర్చ‌లు జ‌రిపింద‌ట‌. చూద్దాం. ఇవ్వాళ క‌రెక్ట్ అనుకున్న‌ది రేపు త‌ప్పు అవ్వ‌చ్చు. రేపటి ది త‌ప్పు అన్న‌ది ఇవ్వాళ క‌రెక్ట్ అవ్వ‌చ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories