Top
logo

ప్రణయ్ హత్య కేసు : హంతకుడిని పట్టుకున్న పోలీసులు

ప్రణయ్ హత్య కేసు : హంతకుడిని పట్టుకున్న పోలీసులు
X
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు హంతకుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు హంతకుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ ను చంపింది బీహార్ కు చెందిన సుభాష్ శర్మగా పోలీసులు గుర్తించారు. మారుతీరావు దగ్గర 15 లక్షలు సుపారీ తీసుకుని ప్రణయ్ ను సుభాష్ శర్మ అంతమొందించినట్లు విచారణలో వెల్లడైంది. ప్రణయ్ హత్య కేసును కుట్రను ఛేదించిన నల్లగొండ పోలీసులు నిందితుడు సుభాష్ శర్మను బీహార్ లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని పాట్నా నుంచి నల్గొండకు తరలిస్తున్నారు. రేపు సుభాష్ శర్మను హైదరాబాద్ తీసుకువచ్చి అక్కడి నుంచి నల్లగొండకు తీసుకెళ్తారని తెలుస్తోంది. ఇక ఈ హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న ఏడుగురిని జిల్లా ఎస్పీ మీడియా ఎదుట హాజరుపరిచారు. ఏ1 మారుతీరావు, ఏ2 సుభాష్‌ శర్మ, ఏ3 అస్గర్‌ అలీ, ఏ4 మహ్మద్‌ బారీ, ఏ5 అబ్దుల్‌ కరీం, ఏ6 మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ ఏ7 గా ఉన్నారు. వీరిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టె దృశ్యాలను ప్రణయ్ కుటుంబసభ్యులు వీక్షించారు.

Next Story