కౌన్సెలింగ్‌కు హాజరుకానున్న ప్రదీప్‌

కౌన్సెలింగ్‌కు హాజరుకానున్న ప్రదీప్‌
x
Highlights

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడి, తప్పించుకు తిరుగుతున్న ప్రముఖ యాంకర్‌ మాచి రాజు ప్రదీప్‌ సోమవారం బేగంపేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో...

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడి, తప్పించుకు తిరుగుతున్న ప్రముఖ యాంకర్‌ మాచి రాజు ప్రదీప్‌ సోమవారం బేగంపేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకానున్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్‌ సమాచారం అందించారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిపోయిన ప్రదీప్‌ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. ప్రస్తుతం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పోలీసులు పట్టుబడుతున్నా ప్రదీప్‌ రాకపోవడంతో అతడు పరారీలో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై యాంకర్ ప్రదీప్ ఓ వీడియో ద్వారా స్పందించారు. తాను తప్పుచేసినట్లు అంగీకరించిన ప్రదీప్.. ఇంకెవరూ తనలాగా తప్పుచేయకూడదంటూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాను ఇప్పటికీ పోలీస్ కౌన్సెలింగ్‌కు ఎందుకు హాజరుకాలేదు, ఇతరత్రా విషయాలను వీడియో ద్వారా ప్రదీప్ షేర్ చేసుకున్నారు. ప్రదీప్‌ శుక్రవారం వీడియో ద్వారా తాను కౌన్సెలింగ్‌కు హాజరుకాబోతున్నట్లు తెలిపారు.

నిబంధనల ప్రకారం తల్లి లేదా భార్యను కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సి ఉంటుంది. పెళ్లి కాలేదు కాబట్టి తల్లిని తీసుకొని రావాలని నిబంధనలను పోలీసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్‌ఫిలిం ఏర్పాటు చేసుకున్న ఘటనలోనూ ప్రదీప్‌పై పోలీసులు జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories