logo
సినిమా

'మ‌హానుభావుడు'కి ప్ర‌భాస్ అతిథి

మ‌హానుభావుడుకి ప్ర‌భాస్ అతిథి
X
Highlights

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌, యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి చిత్రం...

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌, యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి చిత్రం 'మ‌హానుభావుడు'. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందించారు. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ నెల 29న ఈ సినిమా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా 'బాహుబ‌లి', 'బాహుబ‌లి2' చిత్రాల క‌థానాయ‌కుడు, రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హాజ‌రుకానున్నారు. ప్ర‌భాస్‌తో 'మిర్చి' చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Next Story