ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ సీజ్‌

ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ సీజ్‌
x
Highlights

ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలు, అనుమతులు లేకుండా కట్టిన అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. రాయదుర్గం సమీపంలో...

ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలు, అనుమతులు లేకుండా కట్టిన అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. రాయదుర్గం సమీపంలో సర్వే నంబర్‌ 46లోని ‘పాయే గా’ భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఈ క్రమంలో సినీనటుడు ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను కూడా అధికారులు సీజ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ స్థలం ప్రభుత్వ స్థలంగా గుర్తించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సర్వే నంబర్‌లో 84.30 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలిసింది. ఇందులో 2,200 గజాల్లో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను నిర్మించుకున్నారు. దీన్ని జీవోనంబర్‌ 59 కింద రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ గతంలోనే ప్రభాస్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ స్థలమంతా ప్రభుత్వ స్థలంగా అధికారులు గుర్తించడంతో అక్కడ చేపట్టిన నిర్మాణాలను సీజ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories