logo
సినిమా

ప్రభాస్ ఒక్కడికే ఆహ్వానం!

ప్రభాస్ ఒక్కడికే ఆహ్వానం!
X
Highlights

ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి.. ఇషా అంబానీ...

ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి.. ఇషా అంబానీ వివాహం ఆనంద్‌ పిరమల్‌ తో ఇవాళ జరగనుంది. ఆనంద్‌.. అజయ్‌ పిరమల్‌, స్వాతి పిరమల్‌ల కుమారుడు. నాలుగు రోజుల కిందటే వివాహ వెనుక మొదలయింది. ముంబైలోని ఉదయ్‌పూర్‌లో ఈ వేడుక జరగనుంది. వివాహ వేడుకకు దేశీయ ప్రముఖులే కాకుండా విదేశాల నుండి వ్యాపార దిగ్గజాలు కూడా విచ్చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కొందరు మంత్రు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్ తారలు.. క్రీడా ప్రముఖులు ఇలా అన్ని వర్గాల ప్రముఖులు ఈ వివాహ వేడుకకు తరలివస్తున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడికే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

Next Story