మహానాడులో జగన్ పై వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పోసాని..

మహానాడులో జగన్ పై వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పోసాని..
x
Highlights

మహానాడు సందర్బంగా తెలుగుదేశం పార్టీ విజయవాడలో సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ఆంధ్ర, తెలంగాణ ఇరువురు నేతలు హాజరయ్యారు. మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలో...

మహానాడు సందర్బంగా తెలుగుదేశం పార్టీ విజయవాడలో సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ఆంధ్ర, తెలంగాణ ఇరువురు నేతలు హాజరయ్యారు. మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలో పార్టీ కీలకనేతలు ప్రసంగించారు. కాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత నన్నూరు నర్సిరెడ్డి ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. అయన ప్రసంగం ఆసాంతం వైసీపీ అధినేత జగన్ ,తెలంగాణ ముఖ్యమంత్త్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. జగన్ పై ఒకానొకదశలో నర్సిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ తిరుమల శ్రీవారి హుండీని ఎత్తుకెళతాడని అందుకే స్వామివారు చంద్రబాబును సీఎం చేశారనని అన్నారు.అంతేకాదు జగన్ పాదయాత్రలో చిన్నలకు పెద్దలకు ముద్దులు పెడుతూ అసభ్య చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇక ఈ విమర్శలపై సినీనటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. జగన్ శ్రీవారి హుండీ ఎత్తుకెళతారనివిమర్శలు చేసిన టీడీపీనేతలకు సీఎం చంద్రబాబు దివంగత ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడన్న విషయం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. జగన్ హుండీని లాక్కుంటాడో లేదో ఆ విషయం పక్కపెడితే 20 ఏళ్ల క్రితం ఆ పార్టీలో చేరి ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారా లేదా అని ఎదురు ప్రశ్నించారు పోసాని.

Show Full Article
Print Article
Next Story
More Stories