logo
సినిమా

ఎన్టీఆర్ తో.. పూజా హెగ్డే.. తకధిమితోం!

ఎన్టీఆర్ తో.. పూజా హెగ్డే.. తకధిమితోం!
X
Highlights

డీజే సినిమాలో గ్లామర్ తో అభిమానులను అల్లాడించిన అందాల భామ పూజా హెగ్డే.. ఇప్పుడు మరో ప్రెస్టేజియస్ ప్రాజెక్టులో ...

డీజే సినిమాలో గ్లామర్ తో అభిమానులను అల్లాడించిన అందాల భామ పూజా హెగ్డే.. ఇప్పుడు మరో ప్రెస్టేజియస్ ప్రాజెక్టులో చాన్స్ కొట్టేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో.. హీరోయిన్ గా పూజాను ఫైనల్ చేశారు. చిత్రాన్ని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని సినీ క్రియేషన్స్ వారు.. ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేశారు.

తమ నిర్మాణ సారథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాలో.. పూజా హెగ్డే నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఏప్రిల్ లో షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకు.. తమను సంగీతం అదిస్తున్నట్టు.. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నట్టు ట్వీట్ చేశారు.

ఈ విషయాన్ని పూజా కూడా కన్ఫమ్ చేసింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ టీమ్ తో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని చెప్పింది. డీజేలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన స్టైలిష్ గా కనిపించిన పూజా హెగ్డే.. ఇప్పుడు యంగ్ టైగర్ పక్కన ఎలా అదరగొడుతుందో చూద్దామని నందమూరి అభిమానులు తెగ ఎగ్జయిట్ అవుతున్నారు.

Next Story