Top
logo

మోడీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం

X
Highlights

తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీకి వెళ్తుంటే కేసీఆర్ నోరు మూసుకున్నారని టి.కాంగ్రెస్‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌...

తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీకి వెళ్తుంటే కేసీఆర్ నోరు మూసుకున్నారని టి.కాంగ్రెస్‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు కాకున్నా బీజేపీకి టీఆర్‌ఎస్‌ సహకరించిందని ఆరోపించారు. మోడీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ కూడా కేసీఆర్ రెడీ చేసి అమిత్‌షాకు ఇచ్చారని విమర్శించారు. 119 స్థానాలలో బీజేపీకి అభ్యర్థులు ఉన్నారా? అని ప్రశ్నించిన పొన్నం వేరే పార్టీలలో టికెట్లు రాని నేతలను చేర్చుకొని టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి 100 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ముగ్గురు ఒకటే అని అన్నారు. కేసీఆర్, మోదీ కలిసి కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

Next Story