పొన్నాల పంతం నెగ్గింది... కోదండ ఎందుకు తప్పుకున్నారు మరి!!

పొన్నాల పంతం నెగ్గింది... కోదండ ఎందుకు తప్పుకున్నారు మరి!!
x
Highlights

హస్తినలో జనగామ ఎపిసోడ్‌కు తెరపడింది. పట్టువిడువని విక్రమార్కుడిలా పోరాడిన, పొన్నాల లక్ష్మయ్యకు దాదాపు లైన్‌ క్లియరైంది. జనగామ నుంచి కోదండరాం...

హస్తినలో జనగామ ఎపిసోడ్‌కు తెరపడింది. పట్టువిడువని విక్రమార్కుడిలా పోరాడిన, పొన్నాల లక్ష్మయ్యకు దాదాపు లైన్‌ క్లియరైంది. జనగామ నుంచి కోదండరాం తప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. .ఇంతకీ కోదండరాం తప్పుకున్నారా....తప్పుకోవాల్సి వచ్చిందా...పొన్నాల లక్ష్షయ్య హస్తిన బలం ముందు కోదండరాముడు తట్టుకోలేకపోయాడా...జనగామ బరి నుంచి ప్రొఫెసర్‌ తప్పుకోవడానికి మూడు కారణాలున్నాయి...అవేంటి?

ఇప్పటికే జనగామలో పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసుకున్నారు కోదండరాం. ఇంటింటికీ తిరిగి, తన కోసం ప్రచారం చేసే టీం కూడా సెట్‌ చేసుకున్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా, జనగామ తనకే వస్తుందని, సన్నిహితులు, కార్యకర్తలతో అన్నారు కూడా. కాంగ్రెస్ మొదటి లిస్టులో జనగామ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో, కోదండరాం ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమని అర్థమైంది. కానీ మొదటి నుంచి పరిణామాలు పరిశీలిస్తున్న పొన్నాల లక్ష్మయ్య, లిస్ట్‌ బయటకు రావడంతో, ఒక్కసారిగా జనగామపై నోరు విప్పారు. అనేక పరిణామాల మధ్య చివరికి జనగామ నుంచి కోదండరాం తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. మరి కోదండరాం తప్పుకున్నారా....తప్పుకోవాల్సి వచ్చిందా...కారణాలేంటి?

మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంతో ఒక్కసారిగా షాక్‌ అయిన పొన్నాల లక్ష్మయ్య, వెంటనే ఢిల్లీ ఫ్లైటెక్కెయ్యారు. మాజీ మంత్రిగా, మాజీ పీసీసీ చీఫ్‌గా, తనకున్న పరిచయాలను కదిపారు. జనగామ నుంచి ఆరుసార్లు పోటీ చేసి, నాలుగుసార్లు గెలిచిన తనను కాదని, మరొకరికి ఎలా ఇస్తారని హైకమాండ్‌ దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు. కోదండరాం జనగామ నుంచి తప్పుకోవడానికి పొన్నాల ఒత్తిడి ఒక కారణం కావచ్చన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అధిష్టానం దగ్గర పొన్నాల ప్రయోగించిన మరో అస్త్రం బీసీ కార్డు. బీసీనైనా తనను కాదని, రెడ్డి సామాజికవర్గానికి చెందిన కోదండరాంను జనగామ బరిలోకి దింపితే, బీసీలందరూ పార్టీకి దూరమవుతారని హైకమాండ్‌కు పొన్నాల వివరించినట్టు తెలిసింది. మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన తనను కాదని, అగ్రవర్గానికి టికెట్‌ కేటాయిస్తే, మొదటి నుంచి తనను ఆదరిస్తున్న బీసీలకూ, తప్పుడు సంకేతం వెళ్లినట్టు అవుతుందని చెప్పారట పొన్నాల. ఇదే విషయాన్ని ఢిల్లీలోనే ఉన్న కోదండరాంకు వివరించారు కాంగ్రెస్ పెద్దలు. బీసీలకు ప్రాధాన్యం పెరగాలని, సామాజిక న్యాయం జరగాలని మొదటి చెబుతూ వచ్చారు కోదండరాం. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ సీటును లాక్కున్నారన్న అప్రతిష్ట మూటగట్టుకోవడం ఎందుకని, జనగామ నుంచి టీజేఎస్‌ అధ్యక్షుడు తప్పుకున్నారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories