ఆ మూడు టిక్కెట్లు జగన్ ఎవరికిస్తారో..?

ఆ మూడు టిక్కెట్లు జగన్ ఎవరికిస్తారో..?
x
Highlights

ఏపీలో మరో ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న సందర్బంగా రాజకీయ పార్టీలు అప్పుడే వలసలకు తెరదీశాయి. అందులో వైసీపీ ముందువరుసలో ఉంది. గత కొన్ని రోజులుగా...

ఏపీలో మరో ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న సందర్బంగా రాజకీయ పార్టీలు అప్పుడే వలసలకు తెరదీశాయి. అందులో వైసీపీ ముందువరుసలో ఉంది. గత కొన్ని రోజులుగా ప్రకాశం జిల్లాపై ఫోకస్ పెట్టిన జగన్ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. అందులో గిద్దలూరు, దర్శి, చీరాల స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ మొదలైనప్పటికీ.. ఇంచార్జ్ ఎవరన్నది మాత్రం తేల్చడం లేదు. గిద్దలూరు స్థానానికి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును ఫైనల్ చేయగా.. ఆయన ఇవాళో రేపో పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆరునెలల కిందటే చేరాల్సిన రాంబాబు కోర్టు కేసు కారణంగా వైసీపీలో చేరిక ఆలస్యమైంది. మరోవైపు ఇదే సీటును మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనా రెడ్డి, ప్రస్తుతం ఇంచార్జ్ ఐవి రెడ్డి ఆశిస్తున్నారు.

ఇక దర్శిలో వైసీపీకి వింత పరిస్థితి ఎదురవుతోంది. అక్కడ బలమైన నేతగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. కానీ ఆయన వైసీపీలోనే ఉన్నా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి కనబరచడంలేదు. ఈ క్రమంలో మౌమితా ఫౌండేషన్ అధినేత బాదం మాధవరెడ్డిని జగన్ పాదయాత్ర సమయంలో దర్శి ఇంచార్జ్ గా ప్రకటించారు. కానీ అక్కడ మంత్రి శిద్దా రాఘవరావును ఓడించాలంటే బాదం మాధవరెడ్డి బలం సరిపోదని వైసీపీ భావిస్తోంది. దాంతో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని మరోసారి సంప్రదించగా ఆయన మరో రెండు నెలల పోతే గాని చెప్పనని తేల్చారు.ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఎవరో ఒకరు ఇంఛార్జిగా ఉండక తప్పని పరిస్థితి. ఇదేక్రమంలో వైసీపీలోచేరాలని గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త మద్దిశెట్టి వేణుగోపాల్. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరుపున దర్శికి పోటీ చేశారు. ఆ తరువాత రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో దర్శి టికెట్ వేణుగోపాల్ కే దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.

ఇక మరో నియోజకవర్గం చీరాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఇంచార్జిని మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసిన యడం బాలాజీ
ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను ఢీకొట్టాలంటే బాలాజీ సరిపోడని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో 2009 లో టీడీపీ తరుపున ఒంగోలు ఎంపీగా పోటీచేసిన ఎంఎం కొండయ్య యాదవ్ పేరును పరిశీలిస్తోంది. అంతేకాకుండా వైసీపీలోకి వస్తే ఆమంచి కృష్ణమోహన్ కూడా చేర్చుకునేందుకు ఆ పార్టీ రెడీగా ఉన్నట్టు సమాచారం. మరి ఇక్కడ కూడా ప్రస్తుతం ఉన్న ఇంఛార్జిని మార్చి మరొకరికి టికెట్ ఇస్తారా లేక వేచిచూస్తారా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories