ముందస్తు ఎన్నికలంటేనే హడలెత్తిపోతున్న నేతలు...విపక్ష పార్టీల నేతలే కాదు...అధికార పార్టీ నేతలు....

x
Highlights

ముందస్తు ఎన్నికల ప్రచారంతో పార్టీల్లో దడ మొదలైందా ? పార్టీ కేడర్‌‌ను కాపాడుకునేందుకు నేతలు తంటాలు పడాల్సి వస్తోందా ? తెలుగు రాష్ట్రాల్లో అధికార...

ముందస్తు ఎన్నికల ప్రచారంతో పార్టీల్లో దడ మొదలైందా ? పార్టీ కేడర్‌‌ను కాపాడుకునేందుకు నేతలు తంటాలు పడాల్సి వస్తోందా ? తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీతో పాటు విపక్షాలకు కొత్త కష్టాలు మొదలయ్యాయా ? సభలు, సమావేశాలు నిర్వహించాలంటే నేతలు ఎందుకు వణికిపోతున్నారు ? ముందస్తు ఎన్నికలు రాకపోతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నేతలు పరిస్థితి ఏంటీ ?

జమిలి ఎన్నికల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ముందస్తు ఎన్నికలు జరగుతాయన్న ప్రచారం ఊపందుకొంది. జమిలికి టీఆర్ఎస్‌ జై కొడితే టీడీపీ నై అంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల నేతలు ముందస్తు ఎన్నికలంటేనే హడలెత్తిపోతున్నారు. విపక్ష పార్టీల నేతలే కాదు అధికార పార్టీ నేతలు సైతం ముందస్తు ఎన్నికలంటే భయపడుతున్నారు. ఎన్నికల్లో టికెట్లు ఆశించే నేతలు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియకపోయినా కేడర్‌‌ను కాపాడుకునేందుకు నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రచారంతో పార్టీ శ్రేణులను కాపాడుకోవడానికి నాయకులు తంటాలు పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలే కాదు అధికార పార్టీ నేతలకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. నియోజక వర్గాల్లో ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ఆశావహులు, టికెట్ కన్ఫామ్ అయిన నేతలు సభలు, సమవేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులు తమ వెంటే ఉండేందుకు ప్రతి రోజు వేలకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఖర్చులు తడసి మోపెడవుతుండటంతో మీటింగ్ అంటేనే వణికిస్తున్నారు. ఒక్కో నేత ప్రతి రోజు పది వేల రూపాయలకుపైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. టికెట్‌ వస్తుందో రాదో క్లారిటీ లేకపోయినా భోజనాలు, విందులకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. డబ్బు విషయంలో అధికార పార్టీ నేతలకు ఇబ్బంది లేకపోయినా ప్రతిపక్ష నేతలకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయ్. ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ఇప్పటికే రోజువారీ ఖర్చు పెరిగిపోయి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

టికెట్లు ఆశిస్తున్న నేతలు భోజనాలు, విందులు, ఖర్చులు పెట్టకపోతే పార్టీ కేడర్‌ జారిపోయే ప్రమాదం ఉంది. దీంతో ముందస్తు ఎన్నికలు రాకపోతే తమ పరిస్థితి ఏంటని డబ్బు ఖర్చుపెడుతున్న నేతలు లోలోపలే కుమిలిపోతున్నారు. అప్పులు చేసి ఖర్చు పెట్టినా టికెట్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. టికెట్‌ వచ్చినా గెలుస్తామో లేదో అన్న అనుమానాలు నేతల్లో వ్యక్తమవుతున్నాయ్. డబ్బు ఖర్చు పెట్టలేక పార్టీ శ్రేణులను వదులుకోలేక నేతలు పదవుల కోసం కోటి తిప్పలు పడుతున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే సరి లేదంటే ఇలా కేడర్ ను కాపాడుకునేందుకు మే నెల వరకు ఖర్చు చేయక తప్పదు అలా ఖర్చు చేస్తూ పోతే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారు నేతలు. ఈ టెన్షన్ అధికార పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతలను కలవర పెడుతోంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న నేతలకు, ఇప్పటికే పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న పార్టీ నేతలను మరింత ఆలోచనలో పడేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories