Top
logo

అమెరికా పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన చిలుక

Highlights

అమెరికాకు చెందిన పోలీసుల్ని ఓ చిలుక ముప్పుతిప్పలు పెట్టింది. అమెరికా ఒరెగాన్ స్టేట్ పోలీసులకు వింత అనుభవం...

అమెరికాకు చెందిన పోలీసుల్ని ఓ చిలుక ముప్పుతిప్పలు పెట్టింది. అమెరికా ఒరెగాన్ స్టేట్ పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. ఆర్డర్ చేసిన వస్తువును ఇచ్చేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్న లీ పుర్డే అనే యూపీఎస్‌ డెలివరీ బాయ్‌ కి ఓ ఇంటి నుంచి ‘ఏడుస్తూ రక్షించండి.. రక్షించండి’ అంటూ ఆర్తనాదాలతో ఏడుస్తున్న మహిళ అరుపులు వినిపించాయి. అంతే మహిళ ప్రమాదంలో ఉందని భావించి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళని రక్షించేందుకు ప్రయత్నించారు. లీపుర్డే చెప్పిన ఇంటిలోకి ప్రవేశించారు. కేకలు వేసిన ఆ మహిళ గురించి అన్వేషించారు. అయితే అక్కడే ఉన్న ఓ గదిలోకి వెళ్లగా మహిళ గొంతుతో చిలుక రక్షించండి.. రక్షించండి అని అరుస్తుంది. దీంతో కంగుతున్న పోలీసులు చిలుక ఏదైనా ప్రమాదంలో ఉందని అనుకున్నారు. కానీ చిలుకకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కావాలనే చిలుక అరుస్తుందని గుర్తించారు. చిలుక నిర్వాకం పై యజమానురాలు సుసాన్ బైర్డ్ స్పందించింది. తానెంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిలుక డియాగో ను ఇంట్లో వదిలి పనిమీద బయటకు వెళ్లనట్లు తెలిపారు. దానికి ఒంటరిగా అనిపించి అలా అరిచినట్లుంద’ని ఆమె వివరణ ఇచ్చింది.

Next Story