నాలుగు నెలల క్రితం అదృశ్యమైన మహిళ అనూహ్యంగా..

నాలుగు నెలల క్రితం అదృశ్యమైన మహిళ అనూహ్యంగా..
x
Highlights

హైదరాబాద్.. శంషాబాద్ లో యువతి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు చేధించారు.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పోచెట్టి గ్రామానికి చెందిన పూజ అనే యువతికి...

హైదరాబాద్.. శంషాబాద్ లో యువతి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు చేధించారు.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పోచెట్టి గ్రామానికి చెందిన పూజ అనే యువతికి నాలుగు నెలల క్రితం వివాహం అయింది. అయితే అనారోగ్య కారణాల వల్ల పెళ్ళైన పది రోజులకే పూజ పుట్టింటికి వచ్చేసింది.ఈ క్రమంలో ఉన్నట్టుండి ఆమె అదృశ్యం అయింది. ఆమె వద్దనున్న ఫోన్ రింగ్ అవుతూనే ఉంది కానీ ఫోన్ మాత్రం ఎత్తడం లేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి పలువురిని విచారించి చివరకు ఆమెను కిడ్నపర్ చెరనుంచి విడిపించారు. శంషాబాద్ లోని సుల్తాన్ పల్లి గ్రామానికి చెందిన చింటూ అనే యువకుడు పూజను కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు.నిందితుడు చింటూని అరెస్టు చేసి కిడ్నాప్ తో పాటు పలు సెక్షన్లకింద కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories