ఆ వార్త‌ల్లో నిజం లేదు

ఆ వార్త‌ల్లో నిజం లేదు
x
Highlights

అమ్మాయి కళ్లతో నవ్వితే ఎంత మంది ఫిదా అవుతారో ఇటీవల ప్రియా వారియర్ ఒక్క వీడియో క్లిప్ తో చెప్పేసింది. త‌న క‌నుసైగ‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల్ని...

అమ్మాయి కళ్లతో నవ్వితే ఎంత మంది ఫిదా అవుతారో ఇటీవల ప్రియా వారియర్ ఒక్క వీడియో క్లిప్ తో చెప్పేసింది. త‌న క‌నుసైగ‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్ము ఓవ‌ర్ నైట్ స్టార్ డం సంపాదించుకుంది. ప్రియా వారియ‌ర్ ..! యువ‌కుల క‌ల‌ల రాకుమారి. ఓరు ఆధార్ ల‌వ్ అనే సినిమాలోని ఓ పాట‌లో క‌న్ను గీటుతూ ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌రిటీని సంపాదించుకుంది. ఎంత‌లా అంటే ట్రెండింగ్ లో శృంగార తార స‌న్నిలియోన్ ను క్రాస్ చేసేంత‌లా. మ‌రి అంత‌క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ్మ గురించి రోజుకో వార్త పిల్మింన‌గ‌ర్ లో చ‌క్కెర్లు కొడుతుంది. ప్రియా వారియ‌ర్ త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తినేలా యాక్ట్ చేసిందంటూ హైద‌రాబాద్ ప‌ల‌క్ నుమాకు చెందిన చెందిన ముస్లింలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
అంతేకాదు సంబంధిత వీడియోల్ని పోలీసుల‌కు సాక్ష్యంగా ఇచ్చిన పిటిష‌న‌ర్లు ..ఆ సినిమాలోని సీన్ల‌ను తొల‌గించి విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇదంతా ఒకెత్తయితే ప్రియా వారియ‌ర్ పై ప‌త్వా జారీ చేసిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. ఓవ‌ర్ నైట్ పాపులారిటీ సంపాదించుకొని వ‌రుస ఆఫ‌ర్లు ద‌క్కించుకుంటున్న వారియ‌ర్ కు ఇది క‌ష్ట‌మే అయినా అందులో వాస్త‌వం లేద‌ని విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.
ఓ పేర‌డి వెబ్ సైట్ పాపులారిటీ కోసం వారియ‌ర్ పై అసత్య ప్ర‌చారం చేస్తుంద‌ని, ఆ వార్త‌ల్లో ఎటువంటి నిజం లేద‌ని పోలీసులు తేల్చి చెప్పారు. మొత్తానికి ఒక్క 20 సెక‌న్ల వీడియోలో ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించిన ప్రియా వారియ‌ర్ కు అభిమానులు జేజేలు ప‌ల‌క‌డం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories