logo

గజల్ అత్యాచారానికి పాల్పడ్డాడు : పోలీసులు

గజల్ అత్యాచారానికి పాల్పడ్డాడు : పోలీసులు
Highlights

గజల్‌ శ్రీనివాస్ మ‌సాజ్ వీడియోలు క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. లైంగిక ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ అయిన గ‌జ‌ల్ భాగోతాలు...

గజల్‌ శ్రీనివాస్ మ‌సాజ్ వీడియోలు క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. లైంగిక ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ అయిన గ‌జ‌ల్ భాగోతాలు ఒక్కోటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. త‌న‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో స్పందించిన గ‌జ‌ల్ బాధితురాల్ని త‌న బిడ్డ‌లా చూసుకున్నాన‌ని...లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఫిర్యాదు చేసిందంటే ఆశ్చర్యం కలిగిందని తెలిపాడు. ఈనేప‌థ్యంలో బాధితురాలితో మసాజ్ చేయించుకోవడం బలవంతంగా హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టడం, కాళ్లు ఒత్తిచ్చుకోవడం వంటి వీడియోలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆ వీడియోల‌కు గ‌జ‌ల్ చెప్పిన మాటలు ఏ విధ‌మైన పొంత‌లేన‌ట్లే తెలుస్తోంది. అంతేకాదు గ‌జ‌ల్ బాధితురాలిపై అత్యాచార య‌త్నానికి పాల్ప‌డ్డాడ‌ని రిమాండ్ రిపోర్టులో పంజగుట్ట పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు చెప్పిన వివ‌రాల ఆధారంగా గ‌జ‌ల్ ఆఫీస్ లో ఆఫీస్‌లో బెడ్‌రూం ఉందని, పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరుపరిచామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ప‌లువురి వాంగ్మూలాన్ని న‌మోదు చేసుకున్న పోలీసులు .. బాధితురాలికి సినిమా అవ‌కాశాలు ఇప్పిస్తానంటూ ప్ర‌లోభాల‌కు గురిచేశార‌ని అన్నారు.

లైవ్ టీవి

Share it
Top