తొలిప్రధాని నెహ్రూకు ఘన నివాళి

nanireddy
Updated on: 24 Dec 2018 1:33 PM IST
తొలిప్రధాని నెహ్రూకు ఘన నివాళి
X

భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు 54వ వర్ధంతి సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు ప్రముఖులు ఘననివాళులర్పించారు. నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళు అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. న్యూఢిల్లీలోని శాంతి వనంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా, రాబర్ట్‌వాద్రాలు శ్రద్ధాంజలి ఘటించారు. కాగా తండ్రి మోతీలాల్‌ నెహ్రూ వారసుడిగా 1929లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా మొదటిసారి ఎన్నికయినా నెహ్రు.. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ తొలి ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన చాచా నెహ్రుగా అయన సుప్రసిద్ధులు.

nanireddy

nanireddy

Next Story