త్వ‌రలో అందుబాటులోకి రానున్న ప్లాస్టిక్ నోట్లు

త్వ‌రలో అందుబాటులోకి రానున్న ప్లాస్టిక్ నోట్లు
x
Highlights

న‌ల్ల‌కుబేరుల్ని ఆటక‌ట్టించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటుంది. గ‌తంలో పెద్ద‌నోట్ల ర‌ద్దు చేసి భారీగా న‌ల్ల‌ధ‌నాన్ని వెలికి తీసే...

న‌ల్ల‌కుబేరుల్ని ఆటక‌ట్టించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటుంది. గ‌తంలో పెద్ద‌నోట్ల ర‌ద్దు చేసి భారీగా న‌ల్ల‌ధ‌నాన్ని వెలికి తీసే ప్ర‌య‌త్నం చేసింది. తాజాగా కేంద్రం మ‌రో ప్ర‌తిష్టాత్మ‌కం నిర్ణయం తీసుకోనున్న‌ట్లు స‌మాచారం.
ఇప్ప‌టికే నోట్ల ర‌ద్దు త‌ర్వాత 2వేల నోటు తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్లాస్టిక్ నోట్లు ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌య‌త్నం ప్రారంభించింది. త్వ‌ర‌లోనే మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ట్టు చెబుతోంది. తొలుత ప్లాస్టిక్ ప‌ది రూపాయాల నోట్లు రంగంలోకి రాబోతున్నాయి. ప్రయోగాత్మకంగా ఐదు నగరాల్లో వీటిని తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి రాధా కష్ణన్‌ లోక్‌ సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

‘రూ.10 విలువ గల ప్లాస్టిక్‌ నోట్లను ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా తీసుకు రావా లని నిర్ణయించాం. కోచి, మైసూర్‌, జయపుర, సిమ్లా, భువనేశ్వర్‌ నగరాల్లో వీటిని ప్రయోగాత్మకంగా చలామణీ లోకి తీసుకొస్తాం’ అని రాధాక ష్ణన్‌ తెలిపారు. అయితే ఎప్పుడు తీసుకురానున్నది మాత్రం వెల్లడించలేదు.
ఇక రూ.2000 నోట్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రూ.2వేల నోట్ల చలామణీని నిలిపివేయా లనే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం దృష్టికి రాలేదని చెప్పారు. 2016 నవంబరులో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రూ. 2000 నోటును ప్రవేశ పెట్టారు. దీంతో చిల్లర సమ స్యలు ఏర్పడ టంతో రూ.500 కొత్త నోట్లను కూడా విడుదల చేశారు. అయితే రూ.2వేల నోట్లను మళ్లీ వెనక్కి తీసుకుంటా రని, వాటి ముద్రణను కూడా నిలిపివేశారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ప్రభుత్వం అనేకసార్లు తోసిపుచ్చింది. రూ.2వేల నోట్ల చలామణీని నిలిపివేయడం లేదని పలుమార్లు స్పష్టం చేసింది. దాంతో ఊహాగానాల‌కు చెక్ పెట్టిన‌ట్ట‌య్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories