logo
సినిమా

రేణూదేశాయ్ రెండో పెళ్లికి కౌంట్ డౌన్...కాబోయే భర్త ఫోటోలు పోస్ట్ చేసిన రేణుదేశాయ్‌

రేణూదేశాయ్ రెండో పెళ్లికి కౌంట్ డౌన్...కాబోయే భర్త ఫోటోలు పోస్ట్ చేసిన రేణుదేశాయ్‌
X
Highlights

తన రెండో పెళ్లిపై కొనసాగుతున్న సస్పెన్స్‌ను.. రేణూ దేశాయ్ బ్రేక్ చేసింది. ట్విట్టర్ వేదికగా ఎంగేజ్‌మెంట్...

తన రెండో పెళ్లిపై కొనసాగుతున్న సస్పెన్స్‌ను.. రేణూ దేశాయ్ బ్రేక్ చేసింది. ట్విట్టర్ వేదికగా ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ చేసి.. అనుమానాలన్నింటిని పటాపంచలు చేసింది. కానీ.. తనకు కాబోయే భర్త ఫుల్ పిక్చర్‌ను రేణూ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు అతను ఎవరై ఉంటారన్నదే హాట్ టాపిక్‌గా మారింది. సినీనటి రేణూ దేశాయ్‌ తన కొత్త జీవితానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్విట్టర్ వేదికగా కొంతకాలంగా తన రెండో వివాహం గురించి చెబుతున్న రేణు.. లేటెస్ట్‌గా తన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. కాబోయే జీవిత భాగస్వామి చేతిపై చెయ్యేసిన ఫోటోను రేణూ షేర్ చేసింది.

రేణూ దేశాయ్‌ పోస్ట్‌ చేసిన ఫొటోల్లో.. నిశ్చితార్థపు ఉంగరాలు కూడా ఉన్నాయి. తన ఎంగేజ్ మెంట్ విషయాన్ని చెప్తూనే.. బాధ నుంచి కోలుకునేందుకు సాయంగా నిలిచిన మీ నిజాయితీకి ధన్యావాదాలంటూ కవితను ట్యాగ్ చేశారు. ఈ ఫోటో విడుదల చేసిన.. కొన్ని గంటల్లోనే తనకు కాబోయే భర్త తన వేలికి రింగ్ తొడిగే ఫోటోను పోస్ట్ చేశారు. రేణు పోస్టులకు అభిమానులతో పాటు పవన్ ఫ్యాన్స్ కూడా స్పందించారు. కొందరు కంగ్రాట్స్ చెప్తే.. మరికొందరు రెండో పెళ్లి వద్దంటూ రేణూను రెక్వెస్ట్ చేశారు. ఐతే.. పాజిటివ్‌గా స్పందించిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Next Story