స్వల్పంగా తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు

nanireddy
Updated on: 24 Dec 2018 3:32 PM IST
స్వల్పంగా తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు
X

ఇటీవల పెరుగుతూ వచ్చిన చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 10 పైసలు తగ్గింది. దీంతో అక్కడ లీటర్‌ పెట్రోల్‌ 82రూపాయల 38పైసలు, డీజిల్‌ 75రూపాయల 48పైసలకు చేరింది. ముంబయిలో పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గడంతో పెట్రోల్‌ 87రూపాయల 74పైసలు, డీజిల్‌ 79రూపాయల 13పైసలుగా కొనసాగుతోంది.

nanireddy

nanireddy

Next Story