ఆనందం ఆవిరి... పెట్రోలు ధర పైసానా తగ్గింపు?

ఆనందం ఆవిరి... పెట్రోలు ధర పైసానా తగ్గింపు?
x
Highlights

పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. అవునా... అని సంబర పడకండి. తగ్గిన రేటు ఎంతో తెలిస్తే నవ్వాలో..ఏడవాలో అర్థం కాదు. తగ్గిన ధర చూసి ఎవరైనా...

పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. అవునా... అని సంబర పడకండి. తగ్గిన రేటు ఎంతో తెలిస్తే నవ్వాలో..ఏడవాలో అర్థం కాదు. తగ్గిన ధర చూసి ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఎవరిని ఉద్ధరించడానికో ఈ తగ్గింపు అని అనడం ఖాయం. పెట్రో కంపెనీలు తీసుకున్న తుగ్లక్ నిర్ణయంపై విపక్షాలతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రో కంపెనీలు కూడా ప్రజల్ని పండుగ చేసుకోమంటున్నాయి. ఎందుకో తెలుసా. పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాం.. సంబరపడమంటున్నాయి. ఇంతకీ పెట్రోలు, డీజీల్ పై తగ్గింది ఎంతో తెలుసా..ఒక్క పైసా....ఒకే ఒక్క పైసా మాత్రమే. అవును మీరు వింటున్నది నిజం. పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని కొద్ది రోజులుగా జనం గగ్గోలు పెగుతుంటే...చమురు కంపెనీలు మాత్రం ఎంతో ఉదారంగా కేవలం పైసా ధర తగ్గించాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొదట లీటరు పెట్రోలు ధర 60 పైసల చొప్పున, లీటరు డీజిల్ ధర 56 పైసల చొప్పున తగ్గించినట్లు ప్రకటించింది. ఆ వార్త చూసి వాహనదారులు కాస్త ఊరట చెందేలోపే..ఊహించని షాక్ ఇచ్చింది. లీటరు పెట్రోలు, డీజిల్‌పై తగ్గింది..పైసానే అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గొప్పగా ప్రకటించుకుంది, వరుసగా పెరుగుతున్న రేట్లకు బ్రేక్ పండిందని వినియోగదారులు అనుకున్న కొద్దిగంటల్లోనే చావు కబురు చల్లగా చెప్పింది.

పెట్రో రేట్ల తగ్గింపులో వచ్చిన తేడాపై కొద్దిసేపపటి తర్వాత చమురు సంస్థలు వివరణ ఇచ్చాయి. క్లరికల్‌ మిస్టేక్ వల్ల తొలుత లీటరు పెట్రోల్‌ ధర 60పైసలు, డీజిల్‌ లీటరుకు 56పైసలు తగ్గించినట్లు ప్రకటన వచ్చిందని తెలిపాయి. సాంకేతిక కారణాల వల్ల ఐఓసీ వెబ్‌సైట్‌లో తప్పులు దొర్లి..పాత ధరలు పొరపాటున అప్‌ డేట్ అయ్యాయని చెప్పాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీరుపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు సంస్థలు జనంతో గేమ్స్ ఆడుతున్నాయని మండి పడుతున్నారు.

పెట్రోలు, డీజిల్ ధరలు ఒక పైసా తగ్గించడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీవి పిల్ల చేష్టలని మండి పడ్డారు. ఎన్డీఏ పాలకులు జనంతో పరిహాస మాడుతున్నారని ట్విట్టర్ లో విమర్శించారు. పెట్రో ధరల్ని రూపాయల్లో పెంచి....తగ్గించడం మాత్రం పైసల్లోనా అని రాహుల్ ప్రశ్నించారు. అటు కాంగ్రెస్ నేతలు పెట్రో సంస్థల తీరుపై విరుచుకు పడ్డారు.

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు పెట్రోల్ , డీజిల్ ధరల్ని స్థిరంగా ఉంచిన ప్రభుత్వం...పోలింగ్ ముగిసి తర్వాత నుంచి వరుసగా 16 రోజులుగా రేట్లు పెంచుతూ వచ్చింది. గత 15 రోజుల్లో లీటర్ పెట్రోల్ 3 రూపాయల 8 పైసలు పెరగగా, లీటరు డీజిల్ 3 రూపాయల 38 పైసలు పెరిగింది. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై సామాన్యుడి ఆగ్రహం నేపథ్యంలో 17 రోజుల్లో మొదటిసారి కేవలం పైసా మాత్రమే తగ్గించి ప్రజల్ని అవాక్కయ్యేలా చేశాయి. అయితే పెట్రోలు డీజిల్‌పై పైసా తగ్గించి కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇస్తే..కేరళ సర్కారు పెట్రో ఉత్పత్తులపై పన్ను తగ్గించి ఊరట కల్పించింది. రాష్ట్ర పన్ను తగ్గింపుతో లీటరుకు రూపాయి చొప్పున ధర తగ్గనుంది. తగ్గిన ధర జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories