Top
logo

చమురు చల్లబడుతోంది..

చమురు చల్లబడుతోంది..
X
Highlights

ప్రపంచ మార్కెట్లలో ముడిచమురు ధరలు చల్లబడుతూనే ఉన్నాయి. గతవారం సోర్‌ క్రూడ్‌గా పిలిచే బ్రెంట్‌ బ్యారల్‌ 54...

ప్రపంచ మార్కెట్లలో ముడిచమురు ధరలు చల్లబడుతూనే ఉన్నాయి. గతవారం సోర్‌ క్రూడ్‌గా పిలిచే బ్రెంట్‌ బ్యారల్‌ 54 డాలర్ల దిగువకు చేరిన సంగతి తెలిసిందే.. అలాగే లైట్‌ స్వీట్‌ క్రూడ్‌గా ప్రసిద్ధమైన నైమెక్స్‌ 46 డాలర్ల దిగువన స్థిరపడింది. శుక్రవారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 1 శాతం క్షీణించి 53.82 డాలర్లను తాకగా… న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ సైతం 0.65 శాతం వెనకడుగుతో 45.59 డాలర్ల వద్ద ముగిసింది. చమురు ధరల పతనం కారణంగా ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి బలపడుతూ వస్తోంది. అక్టోబర్‌ 31 నుంచి ఇప్పటివరకూ రూపాయి 5.4 శాతం ర్యాలీ అవుతోంది. ఇదే కాలంలో బ్రెంట్‌ చమురు 40 శాతం పతనానికి కారణమైంది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కూడా 20 నుంచి 21 పైసలు తగ్గింది.

Next Story