తుపానుతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

తుపానుతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
x
Highlights

పెథాయ్ తుపానుతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. తుపాను సహాయ చర్యల కోసం 25 డ్రోన్ టీమ్ లను ఏర్పాటు...

పెథాయ్ తుపానుతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. తుపాను సహాయ చర్యల కోసం 25 డ్రోన్ టీమ్ లను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తారు. తీర ప్రాంతాల్లో డ్రోన్లను పంపి వాటి ద్వారా ఎప్పటికప్పుడు తుపాను వాతావరణాన్ని గమనిస్తారు. తుపాన్ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రభావిత మండలాల్లో స్కూళ్లకు రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటించారు. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. తూ.గో జిల్లా కోనసీమలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల నివాసితులు భయాందోళనలు చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ముందస్తుగా 50కి పైగా పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, నరసాపురం, ఆచంట, యలమంచిలి మండలాల్లో అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

తుపాన్ నేపథ్యంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఆదివారం సాయంత్రానికి అనేకచోట్ల విస్తారంగా అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అక్కడక్కడా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పాపికొండలకు విహారయాత్రను అధికారులు నిలిపివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories