logo
జాతీయం

రామమందిర నిర్మాణాన్ని ప్రజలే మొదలుపెడతారు: బాబా రాందేవ్

రామమందిర నిర్మాణాన్ని ప్రజలే మొదలుపెడతారు: బాబా రాందేవ్
X
Highlights

రామమందిర వ్యవహారం మళ్లీ అగ్గిరాజేస్తోంది. అయోధ్యలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రామమందిరంపై చట్టం తేవాలన్న...

రామమందిర వ్యవహారం మళ్లీ అగ్గిరాజేస్తోంది. అయోధ్యలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రామమందిరంపై చట్టం తేవాలన్న డిమాండ్‌తో శివసేన, విశ్వహిందూ పరిషత్ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. రేపు లక్షమందితో వీహెచ్‌పీ ధర్మ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో యోగా గురువు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణ విషయంలో ప్రజల్లో సహనం నశించిందని వ్యాఖ్యానించారు. హరిద్వార్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రామ మందిరం కోసం త్వరగా చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే ప్రజలే రామ మందిర నిర్మాణం ప్రారంభిస్తారన్నారు. ఒకవేళ అదే జరిగితే.. శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. రాముడికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఎవరూ లేరని.. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఆయన భక్తులేనన్నారు.

Next Story