బాయ్ ఫ్రెండ్ కోసం 'ఇల్లు చక్కబెట్టిన' తల్లీకూతురు!

బాయ్ ఫ్రెండ్ కోసం ఇల్లు చక్కబెట్టిన తల్లీకూతురు!
x
Highlights

బాయ్ ఫ్రెండ్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని ఓ యువతి తన కొంపకే ఎసరు తెచ్చింది. ఆపై తల్లి చేసిన నిర్వాకంతో ముగ్గురు జైలుపాలయ్యారు. వివరాల్లోకివెళితే విశాఖ...

బాయ్ ఫ్రెండ్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని ఓ యువతి తన కొంపకే ఎసరు తెచ్చింది. ఆపై తల్లి చేసిన నిర్వాకంతో ముగ్గురు జైలుపాలయ్యారు. వివరాల్లోకివెళితే విశాఖ జిల్లా పెందుర్తిలో ఈనెల 2 న డాక్టర్‌ కోట ఉమాకుమార్‌ శంకర్రావు ఇంట జరిగిన భారీ దొందతనం కేసును పోలీసులు చేధించారు. భారీ దోపిడీకి పాల్పడింది శంకర్రావు కూతురు ఆమె స్నేహితుడు, అలాగే భార్య అని తేల్చారు. 2వ తేదీ సాయంత్రం కుటుంబమంతా బయటకు వెళ్లారు . తాను స్థానికంగా ఉన్న బంధువుల ఇంటికి వెళతానని చెప్పిన శంకర్రావు కూతురు లిఖిత ఇంటిలోనే ఉండిపోయింది. ఈ క్రమంలో ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నస్నేహితుడిని ఇంటికి పిలుచుకుని ఇద్దరు కలిసి దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న బీరువాలోని 30 తులాల బంగారం, రూ.3,03,000 నగదును స్నేహితుడికి ఇచ్చి పంపింది లిఖిత. అనంతరం ఇంటికి వచ్చిన తల్లి మహాలక్ష్మికి ఇంట్లో దోపిడీ జరిగిందని నాటకమాడింది. అయితే ఇంట్లో డబ్బు, బంగారం ఎక్కువమొత్తంలో పోయిందని చెబితే రికవరీ ఎక్కువగావస్తుందన్న దురాశతో మహాలక్ష్మి బీరువాలో మిగిలిన డబ్బును బంధువుల ఇంట్లో దాచిపెట్టింది. విషయం తెలిసిన శంకర్రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కూతురిని మొదట నిందితురాలిగా గుర్తించారు అనంతరం కూతురి క్లారిటీతో తల్లి మహాలక్ష్మిని లిఖిత స్నేహితుడు రవిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories