బీజేపీకి మహెబూబా ముఫ్తీ స్ట్రాంగ్ వార్నింగ్

పీడీపీని చీల్చేందుకు ప్రయత్నిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ...
పీడీపీని చీల్చేందుకు ప్రయత్నిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కేంద్రాన్ని హెచ్చరించారు. 1987లో కశ్మీర్‌లో ఎలా ఉగ్రవాదం పెరిగిపోయిందో మరచిపోవద్దన్న ముఫ్తీ కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో 90ల పరిస్థితి కశ్మీర్ లోయలో పునరావృతం కావచ్చని హెచ్చరించారు. అంతేకాకుండా 1987 తరహాలో ప్రజల ఓటు హక్కును ఢిల్లీ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. విభజన రాజకీయాలు, పార్టీల్లో జోక్యం పెరిగితే సలావుద్దీన్, యాసిన్ మాలిక్‌లు మళ్లీ పుట్టే అవకాశాలు ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు.
కశ్మీర్ లోయలో తలెత్తే పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మెహబూబా ముఫ్తీ హెచ్చరించారు. మూడేళ్ల పాటు పీడీపీతో అధికారం పంచుకున్న బీజేపీ ఇటీవలే పీడీపీతో తెగతెంపులు చేసుకుంది. దీంతో మెహబూబా ముఫ్తీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో కశ్మీర్‌లో గవర్నర్ పాలనను అమల్లోకి తెచ్చింది కేంద్రం. పీడీపీలోని అసమ్మతి ఎమ్మెల్యేలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలు మెహబూబా ముఫ్తీని ఆగ్రహానికి గురిచేస్తున్నాయ్.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
8 Aug 2022 4:15 PM GMTRajinikanth: రాజకీయ రంగ ప్రవేశంపై తలైవా ఏమన్నారంటే?!
8 Aug 2022 4:00 PM GMTLIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMT