logo
సినిమా

నటి శ్రీరెడ్డిపై పవన్‌ కల్యాణ్‌ ఫిర్యాదు

నటి శ్రీరెడ్డిపై పవన్‌ కల్యాణ్‌ ఫిర్యాదు
X
Highlights

వివాదాస్పద వ్యాఖ్యలతో తెలుగు చిత్రపరిశ్రమలో నెలకొన్న చీకటి వ్యవహారాలపై గొంతెత్తిన శ్రీరెడ్డిపై టాలీవుడ్‌...

వివాదాస్పద వ్యాఖ్యలతో తెలుగు చిత్రపరిశ్రమలో నెలకొన్న చీకటి వ్యవహారాలపై గొంతెత్తిన శ్రీరెడ్డిపై టాలీవుడ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్‌ ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా శ్రీరెడ్డి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖులు, నటులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తోందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. న్యాయ నిపుణుల సలహా మేరకు కేసు నమోదు చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

పలు వార్తా చానళ్లు, యూట్యాబ్‌ చానళ్లతో మాట్లాడుతూ.. తెలుగు సినిమా ప్రముఖులపై శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు అమ్మాయిలను తక్కువగా చూస్తున్నారని, అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయారు. పరభాషా నటీనటులను ప్రోత్సహిస్తున్నారని, తెలుగువారిని అక్కునచేర్చుకోవడం లేదని ఆమె ఆరోపించారు.


Next Story